Thursday, November 14, 2024

ఐరాస వేదికపై గాంధీ వెలుగు

- Advertisement -
- Advertisement -

Mahatma Gandhi makes special appearance at UN

అక్షరాస్యతపై సందేశం

న్యూయార్క్ : ఐక్యరాజ్య సమితి వేదిక నేపథ్యంలో మహాత్మా గాంధీ విద్య ప్రాధాన్యతపై వెలువరించిన మాటలు సందేశంగా ప్రత్యక్షంగా విన్పించారు. గాంధీజి జయంతి అక్టోబర్ 2ను అంతర్జాతీయ అహింసా దినంగా పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐరాసలోని భారత శాశ్వత ప్రతినిధి బృందం, యునెస్కో మహాత్మా గాంధీ ఇనిస్టూట్ ఆఫ్ పీస్, డెవలప్‌మెంట్ (ఎంజిఐఇపి) సంయుక్తంగా బృందాల వారి చర్చా కార్యక్రమం నిర్వహించింది. ఈ దశలో గాంధీ ప్రత్యేక నిలువెత్తు 3 డి ఎఫెక్ట్ విద్యుత్‌కాంతుల భరిత హాలోగ్రామ్ ప్రత్యక్షం అయింది. ఇదే సమయంలో గాంధీజీ అక్షరాస్యత గురించి చెప్పిన మాటలను మైక్‌లో విన్పించారు. గాంధీనే ప్రత్యక్షంగా మాట్లాడుతున్న అనుభూతిని కల్పించారు. ‘అక్షరాస్యత అనేది విద్యాస అంతం కాదు ఆరంభం కాదు. విద్య ద్వార బాలల్లోని బహుముఖ ప్రతిభను ఆవిష్కరించేందుకు వీలేర్పడుతుంది. దేహం, మనస్సు, మేధస్సు సమన్వయం అనేది హృదయపూర్వక అభ్యాసం లేదా అధ్యయనం అంటే విద్య దీనినే తాను ఆధ్మాతిక శిక్షణ అంటానని , దీని ద్వారానే దేహం , మేధస్సు, మనస్సు మధ్య సమన్వయం సాధించినట్లు అవుతుంది. పరిపూర్ణం సిద్ధిస్తుంది’ అని గాంధీజీ పేర్కొన్న మాటలను విన్పించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News