Sunday, January 19, 2025

14కోట్ల పని దినాలు

- Advertisement -
- Advertisement -

మన మహత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వచ్చే ఆర్థిక సంవత్సరం రాష్ట్రంలో చేపట్టే పనుల ద్వారా దాదాపు 14 కోట్ల పని దినాలను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచర ణ ప్రకటించింది. వివిధ గ్రామీణ జిల్లాలలో చేపట్టే పనులతో కూలీలకు ఉపాధి లభిస్తోంది. అదే విధంగా ఉపాధి పనులలో గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి ఉపయోగపడే పనులు చేస్తున్నారు. వచ్చే 20-24 సంవత్సరానికి సంబంధించి లక్ష్యాలు నిర్ణయించి పటిష్ట ప్రణాళిక అమలు చేయబోతున్నారు. ఇప్పటి గ్రామ, మండల, జిల్లా స్థాయిలలో చేపట్టే బోయే ఉపాధి పనుల గుర్తించి.. అందుకు అనుగుణంగా పనిదినాలను అంచనా వేశారు. జిల్లాల నుంచి వచ్చిన తీర్మానాల మేరకు రాష్ట్రంలో వచ్చే ఏడాది వివిధ ఉపాధి పనులల్లో భాగంగా 13 కోట్ల 98 లక్షల 99853 పని రోజలను కూలీలకు కల్పించేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు.
ఉపాధి పనులలో క్రియాశీలకంగా 57.44 %
రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో భాగంగా జాబ్ కార్డు కలిగిన కూలీలు 1,12,83,805 మంది ఉండగా.. వారిలో పనుల్లో పాల్గొనే కూలీల సంఖ్య 64,80,874 ఉంది. 57.44 శాతం కూలీలు మాత్రమే క్రియాశీలకంగా ఉపాధి పనులలో నిమగ్నమవుతున్నారు. ఉపాధి పనులలో పాల్గొనే కూలీలకు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి కూలీ డబ్బులను అందజేయాల్సి ఉంటోంది. గతేడాది మార్చిలో నెలల చివరి రెండు వారాలకు సంబంధిత కూలీ డబ్బులు ఇప్పటికి చెల్లించలేదు. గత ఆర్థిక సంవత్సరం పరిధిలోకి ఆ కూలీ డబ్బులు చెల్లించాల్సినప్పటికి కేంద్రం ప్రభుత్వం ముందుకు రాకపోవడంలో.. ఆ నిధులతో కూలీలకు చెల్లింపులు ప్రసుత్తం ప్రశ్నర్థకంగా మారాయి. అదే విధంగా సెప్టెంబరు నుంచి డిసెంబరు వరకు చేపట్టిన వివిధ ఉపాధి పనులల్లో పాల్గొన కూలీలకు వేతనాలు అందడం లేదు. దాదాపు రూ. వేయి కోట్లు ఉపాధి బకాయిలు రావాల్సి ఉందని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ నిధులు అందితే గాని రాష్ట్రంలోని ఉపాధి కూలీలకు బకాయిలు చెల్లించే పరిస్థితి లేదు.
 వచ్చే ఏడాది ఆ రాష్ట్రాల్లో పనులు లేవు..
పేదలకు ఉపాధి కల్పించే లక్షంతో 2005లో కేంద్రంలో అప్పటి యుపిఎ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం.. వచ్చే ఏడాది పలు రాష్ట్రాలలో అమలు కావడం లేదు. బిజెపి పాలిత రాష్ట్రాలు గుజరాత్, కర్నాటకతో పాటు పశ్చిమబెంగాల్, సిక్కిం,పాండిచేరి, అండమాన్ నికోబార్, లక్షదీప్ తదితర రాష్ట్రాల్లో వచ్చే ఆర్థిక సంవత్సరం నిర్వహించాల్సిన ఉపాధి పనులకు పని దినాలను ఖారారు చేసే కార్యక్రమాన్ని చేపట్టక పోవడం గమన్హారం. ఈ రాష్ట్రాలలో వచ్చే ఏడాది నిర్వహించే ఉపాధి పని దినాలు సున్నా ఉండడం విశేషం. ఉపాధి హామీ పనులపై గత బడ్జెట్‌లోనే నిధులను కోత విధించిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా ప్రవేశ పెట్టబోయే ఉపాధి పని దినాలను తగ్గించే వీలుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ ఆర్థిక సంవత్సరం చేపట్టిన ఉపాధి పనులకు నిధుల బకాయిల విడుదలకు ఎడతెగని జాప్యం చేస్తోందని కేంద్రం తీరుపై రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
బీహార్‌లో కూలీల నిరసన..
దేశంలోని పలు రాష్ట్రాలలో ఉపాధి కూలీలకు డబ్బులు చెల్లింపులో జాప్యం జరుగుతోంది. ఐదు నెలలుగా గ్రామీణ ఉపాధి హామీలోని కూలీలకు బకాయిలు అందలేదు. పని చేసిన పదిహేను రోజుల్లోనే కూలీ డబ్బులు చెల్లించాలని ఉపాధి హామీ చట్టం పేర్కొంది. అయినా.. సకాలంలో కూలీలకు డబ్బులు అందడం లేదు. కేంద్ర ప్రభుత్వం తీరుతో బకాయిలు చెల్లించాలని బీహార్‌లో వందల సంఖ్యలో మహిళా కూలీల నిరసన చేపట్టారు. కేంద్రం ఉపాధి బకాయిలు చెల్లించక పోవడంతో బ్లాక్ ఆఫీస్‌ల ముందు మహిళా కూలీల ఆందోళన దిగారు. తీవ్ర చలిలోనే ఆరుబయట మహిళలు నిద్రించి తమ నిరసన వ్యక్తం చేశారు. కతిహార్ బ్లాక్ కార్యాలయం వద్ద చంటి పిల్లలతో కూలీలు నిద్రించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News