Wednesday, February 19, 2025

మహాత్మా గాంధీకి రష్యాలో ఘోర అవమానం

- Advertisement -
- Advertisement -

మాంసం, మద్యానికి దూరంగా ఉండాలని బోధించిన మన జాతిపిత మహాత్మా గాంధీకి రష్యాలో ఘోర అవమానం జరిగింది. అక్కడ బీర్లు తయారు చేసే సంస్థ ఏకంగా బీర్ టిన్లపై గాంధీ ఫోటో ముద్రించి విక్రయిస్తోంది. అది కూడా మహాత్ముని పేరు, సంతకంతో సహా ముద్రించి బీర్ టిన్లను సదరు రష్యన్ బెవరేజ్ సంస్థ అమ్ముతోంది. రష్యాకు చెందిన రివోర్ట్ సంస్థ ఇలా బీర్ టిన్లను విక్రయిస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అవి భారతీయ నెటిజన్లను తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నందినీ సత్పతి మనవడు, సాంఘిక కార్యకర్త సుపర్ణో సత్పతి సదరు బీర్ ఫోటోలను ‘ఎక్స్’ మాధ్యమంలో పంచుకుని ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవలసిందిగా ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో చర్చించవలసిందిగా కూడా మోడీకి సత్పతి విజ్ఞప్తి చేశారు.

‘తన మిత్రుడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఈ విషయం చర్చించవలసిందిగా ప్రధాని నరేంద్ర మోడీకి వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను. రష్యాకు చెందిన రివోర్ట్ గాంధీజీ పేరిట బీర్ అమ్ముతోందని వెల్లడైంది’ అని సత్పతి ‘ఎక్స్’ పోస్ట్‌లో తెలిపారు. ఇది ఇలా ఉండగా, గాంధీజీని ఇలా బీర్ టిన్లపై చిత్రీకరించడం పట్ల పలువురు నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ప్రధాని నరేంద్ర మోడీ జోక్యం చేసుకోవాలని, భారత మహోన్నత నేతను అవమానించిన బ్రాండ్‌పై చర్య తీసుకోవాలని సోషల్ మీడియా ఖాతాదారులు అనేక మంది కోరుతున్నారు. భారత ప్రభుత్వం సాధ్యమైనంత త్వరలో రష్యన్ అధికారులతో ఈ విషయమై చర్చించాలని కొందరు విజ్ఞప్తి చేశారు. మరికొందరు ఆ రష్యన్ బ్రాండ్‌ను బహిష్కరించాలని పిలుపు ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News