Wednesday, January 22, 2025

మహాత్మా జ్యోతిరావుపూలే సేవలు మరువలేనివి

- Advertisement -
- Advertisement -

మహాత్మా జ్యోతిరావుపూలే సేవలు మరువలేనివి
చైర్‌పర్సన్ సావిత్రిమేఘారెడ్డి

మన తెలంగాణ/మోత్కూరు: మహాత్మా జ్యోతిరావుపూలే సమాజ అభ్యున్నతికి చేసిన సేవలు మరువలేనివని మున్సిపల్ చైర్‌పర్సన్ తీపిరెడ్డి సావిత్రిమేఘారెడ్డి అన్నారు. జ్యోతిరావుపూలే 132వ వర్థంతి సందర్భంగా సోమవారం మోత్కూరు మున్సిపల్ జ్యోతిరావుపూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలనకు, మహిళోద్ధరణ కోసం ఎంతో కృషి చేశారన్నారు.

అణగారిన వర్గాల ప్రజలకు సమాన హక్కుల కోసం సత్యశోధక్ సమాజ్ ఏర్పాటు చేశారని తెలిపారు. మహిళలను అక్షరాస్యులుగా చేయడానికి తన భార్య సావిత్రిబాయిపూలేను అక్షరాస్యురాలిగా తీర్చిదిద్ది మహిళలకు విద్యనేర్పి మార్గదర్శకులుగా చరిత్రలో నిలిచిపోయారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బి.వెంకటయ్య, కౌన్సిలర్లు బొడ్డుపల్లి కల్యాణ్ చక్రవర్తి, పురుగుల వెంకన్న, వనం స్వామి, కూరెళ్ల కుమారస్వామి, మార్కెట్ మాజీ చైర్మన్ టి.మేఘారెడ్డి, కంచర్ల క్రాంతికుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో…

మహాత్మా జ్యోతిరావుపూలే వర్థంతిని బీసీ రిజర్వేషన్ సాధన సమితి, బీసీ యువజన సంఘాల ఆధ్వర్యంలో మోత్కూరులో పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పూలే చేసిన సేవలను నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీసీ రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్ గౌడ్, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు గడ్డం నర్సింహ, నాయకులు అవిశెట్టి అవిలిమల్లు, గుండగోని రామచంద్రు, బోళ్ల హన్మంతు, ఎడ్ల శ్రీనివాస్, గాదె వెంకటేశ్వర్లు, కారుపోతుల శ్రీనివాస్, మందుల మల్లేష్, బత్తిని ప్రభాకర్, రాచకొండ శ్రీనివాస్, కిరణ్, మహేష్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News