Sunday, December 22, 2024

జూన్ 5న డిగ్రీ, ఇంటర్ ప్రవేశ పరీక్ష

- Advertisement -
- Advertisement -

Mahatma jyotiba phule Degree, Inter Entrance Exam on June 5th

6,7,8 తరగతుల్లో ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు జూన్ 2

మన తెలంగాణ/హైదరాబాద్ : డిగ్రీ, ఇంటర్ కోర్సుల్లో చేరాలనుకునే బిసి విద్యార్థులకు జూన్ 5న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బిసి గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి మల్లయ్య బట్టు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా బిసి గురుకుల కాలేజీల్లో ఇంటర్, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశ పరీక్ష కోసం 51,905 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. వీరిలో ఇంటర్ కోర్సుల కోసం 45,735 మంది దరఖాస్తు చేసుకోగా మహిళా డిగ్రీ కాలేజీలో ప్రవేశం కోసం 6,170 మంది అమ్మాయిలు దరఖాస్తు చేసుకున్నారన్నారు. వీరందరికీ వారి వారి జిల్లా కేంద్రాల్లో జూన్ 5న పరీక్ష నిర్వహిస్తున్నట్లు వివరించారు. బిసి సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 6,7,8 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం జూన్ 2వ తేదీలోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని మల్లయ్య బట్టు కోరారు. దరఖాస్తు చేసుకున్న వారికి జూన్ 19న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం mjptbcwreis.telangana.gov.in వెబ్‌సైట్ చూడాలని, 04023322377, 23328266 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చని సూచించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News