Sunday, December 22, 2024

‘మహావీరుడు’ ట్రైలర్ విజువల్స్ అదిరిపోయాయి..

- Advertisement -
- Advertisement -

హీరో శివ కార్తికేయన్ కథానాయకుడిగా, మడోన్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫాంటసీ యాక్షన్ ఎంటర్ టైనర్’ మహావీరుడు. అదితి శంకర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శాంతి టాకీస్ పతాకంపై అరుణ్ విశ్వ నిర్మిస్తున్నారు. ఏషియన్ సినిమాస్ ఈ చి త్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా విడుదల చే స్తోంది. ఈ నెల 14న మహావీరుడు విడుదల కానున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈ వెంట్‌ని గ్రాండ్‌గా నిర్వహించారు. హీరో అడివి శేష్, స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శేఖర్ కమ్ముల మాట్లాడుతూ..‘ హీరో శివకార్తికేయన్‌ను చూస్తున్నపుడు మనలో ఒకరిలా అనిపిస్తుంది. మహావీరుడు ట్రైలర్ విజువల్స్ గొప్పగా వున్నాయి. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. హీరో శివ కార్తికేయన్ మాట్లాడుతూ.. ‘మహావీరుడు ఫాంటసీ జో నర్ మూవీ. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది. దర్శకుడు అశ్విన్ అద్భుతంగా తెరకెక్కించారు. హీరోయిన్ అదితి చక్కగా నటించింది. ఈ సినిమా ప్రేక్షకులను కొత్తగా ఎంటర్‌టైనర్ చేస్తుంది.

ఈనెల 14న ఫ్యామిలీతో కలసి ఈ సినిమా చూడండి’ అని అన్నారు. దర్శకుడు మడోన్ అశ్విన్ మాట్లాడుతూ.. ‘శివకార్తికేయన్ గ్రేట్ పెర్ఫార్మర్. ఇందులో ఆయన అద్భుతమైన నటన, యాక్షన్ యాంగిల్ చూస్తారు. అదితి శంకర్ ఎనర్జిటిక్‌గా చేసింది. సునీల్ వలనే ఈ సినిమా ఇంత గ్రాండ్‌గా విడుదలవుతుంది’ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ అధితి శంకర్, సరిత, అనుదీప్, నిర్మాత అరుణ్ విశ్వ తదితరులు పాల్గొన్నారు.

Also Read: తానా సభల్లో తన్నులాట.. ‘నీచులారా..’ అంటూ బండ్ల గణేశ్ ఫైర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News