Monday, December 23, 2024

‘పుల్వామా’ నుంచి దృష్టి మళ్లించేందుకే గ్యాంగ్ స్టర్ అతిక్ హత్య..

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్: పుల్వామా దాడికి సంబంధించి ప్రజలను పక్కదారి పట్టించేందుకే అతిక్ హత్య జరిగిందని పిడిపి చీఫ్ మెహబూబా ముఫ్తీ ఆదివారం ఆరోపించారు. జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర సత్యపాల్ మాలిక్ పుల్వామా దాడికి సంబంధించి కేంద్ర వైఫల్యాన్ని వెల్లడించడంతో వ్యూహాత్మకంగా అహ్మద్‌ను హత్య చేశారని, తద్వారా అందరి దృష్టిని మళ్లించేందుకు హత్యాకాండకు తెరతీశారన్నారు.

కాగా ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ సెక్యూరిటీ ప్రొటోకాల్ పాటించడంలో కేంద్ర విఫలమైందన్నారు. దీంతో 2019ఫిబ్రవరిలో పుల్వామా ఉగ్రదాడిలో 40మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారన్నారు. ఈక్రమంలో ముఫ్తీ వేదికగా మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్‌లో అరాచకం, ఆటవికరాజ్యం కొనసాగుతోందన్నారు. రైట్‌వింగ్ కార్యకర్తలు చట్టవిరుద్ధంగా మతోన్మాదంతో కోల్డ్‌బ్లడెడ్ మర్డర్లుకు పాల్పడుతున్నారని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ చీఫ్ హిందీలో ట్వీట్ చేశారు. కాగా రాజకీయవేత్తగా మారిన గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ అతడి సోదరుడిని ముగ్గురు వ్యక్తులు శనివారం రాత్రి కాల్చిచంపారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో పోలీస్‌ల సమక్షంలో వీరి హత్య జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News