మహబూబ్ నగర్: ఆదివారం మహబూబ్ నగర్ పట్టణంలో ని ఎంవిఎస్ కళాశాల మైదానంలో జరగనున్న భారీ బహిరంగ సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ఎక్సైజ్, క్రీడ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి డా. వి. శ్రీనివాస్ గౌడ్, టిఎస్ఐఐసి చైర్మన్ బాలమల్లుతో కలిసి సభ ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి డా.వి శ్రీనివాస్ గౌడ్ మీడియా తో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సిఎం కెసిఆర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సుమారు 14 లక్షల మంది ఇతర రాష్ట్రాలకు, ప్రాంతాలకు వలసలు వెళ్లి నిర్లక్ష్యానికి గురయ్యారన్నారు. నాడు వలసల జిల్లాగా పేరుగాంచిన మహబూబ్ నగర్ ను కెసిఆర్ పాలనలో నేడు లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదిగిందని ప్రశంసించారు.
మహబూబ్ నగర్ ను ఎంతో అభివృద్ధి చేశారు: శ్రీనివాస్ గౌడ్
- Advertisement -
- Advertisement -
- Advertisement -