మహబూబ్‌నగర్ : మున్సిపాల్టీగానే మహబూబ్‌నగర్ ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్నదని , త్వరలో కార్పొరేషన్‌గా మారనుందని అప్పుడు అభివృద్ధి మరింత కొత్త పు ంతలు తొక్కునుందని రాష్ట్ర ఎక్సైజ శాఖ మంత్రి డా. వి. శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా అమరవీరులను స్మరించుకొనుటకై స్థానిక మున్సిపల్ మీ టింగ్‌లో ఏర్పాటు చేసిన కౌన్సిల్ ప్రత్యేక సర్వసభ్య సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన వారికి ఈ సందర్భంగా మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్ అయ్యాక చైర్మన్ కాస్తా మే యర్ అవుతారని కౌన్సిలర్లు కార్పొరేటర్లుగా మారుతారని మహబూబ్‌నగర్ పట్టణం నగరంగా మారబోతోందని ఆయన వెల్లడించారు. జిల్లా కేంద్రంలో అన్ని వైపులకు అభివృద్ధిని విస్తరించేందుకు త్వర లో వీరన్నపేటలో జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి ప్రకటించారు. ప్ర స్తుతం ఉన్న ఎస్పీ కార్యాలయం జోగులాంబ జిల్లా డిఐజి కార్యాలయంగా సేవలందించనుందన్నారు.
ఇప్పటికే ఐటీ టవర్ , లిథియం అయాన్ గిగా ఫ్యాక్టరీలను తీసుకువచ్చామని త్వరలో ఈవీ కార్ల తయారీ పరిశ్రమను కూడా తీసుకువచ్చేందుకు ప్ర యత్నాలు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే ప్రతిపాదిత విమానాశ్రయం కొన్ని సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడిందని త్వరలోనే అనువైన స్థల సేకరణ చేసి విమానాశ్రమం ఏర్పాటుకు కూడా కృషి చేస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న శంషాబాద్ అ ంతర్జాతీయ విమానాశ్రయంపై విమానాల సంఖ్య పెరిగి అధిక ఒత్తిడి పెరిగిందని మన వద్ద ఎయిర్ పోర్ట్ ఏర్పాటు చేస్తే కార్గో , ప్రయాణికుల విమానా ల రాకపోకలకు కూడా వెసులుబాటు ఏర్పడుతుందన్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు మన ఎయిర్ పోర్ట్ అనుబంధంగా మారనుందన్నారు. రాష్ట్ర మంత్రి అయినప్పటికీ నిత్యం మహబూబ్‌నగర్‌ను చూడకుండా ఉండలేకపోతున్నామని నియోజకవర్గంపై తనకున్న ప్రేమను మంత్రి చాటుకున్నారు.
మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన కౌన్సిల్ …
వందల కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చి మున్సిపాల్టీని అభివృద్ధి చేస్తున్నందుకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు కౌన్సిల్ ఈసందర్భంగా ధన్యవాదాలు తెలిపింది.ఈ మేరకు మున్సిపల్ చైర్మన్ కేసి నర్సిములు సభలో ధన్యవాదాలు తెలిపారు. మున్సిపల్ చైర్మన్ కేసి నర్సిములు, క మిషనర్ ప్రదీప్‌కుమార్ , వైస్ చైర్మన్ గణేష్, ప్లోర్ లీడర్లు కట్టా రవికిషన్‌రెడ్డి, షబ్బీర్ , కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.