Thursday, January 23, 2025

కానిస్టేబుల్ దాడిలో గాయపడిన సిసిఎస్ సిఐ ఇఫ్తార్ అహ్మద్ మృతి

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్: ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో కానిస్టేబుల్ దాడిలో తీవ్రంగా గాయపడిన సిసిఎస్ సిఐ ఇఫ్తార్ అహ్మద్ శనివారం హైదరాబాద్‌లోని ఓ ఆసుపల్రో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. గత రెండు రోజుల క్రితం మహిళా కానిస్టేబుల్‌తో వివాహేతర సంబంధం నేపథ్యంలో ఆమె భర్త జగదీశ్ సిసిఎస్ సిఐ ఇఫ్తార్ అహ్మద్‌ను తీవ్రంగా గాయపర్చారు. దీంతో అతడిని మహబూబ్‌నగర్‌లోని ఎస్‌విఎస్‌కు తరలించగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ సిఐ చికిత్స పొందుతూ మృతి చెందారు.

ఇదిలా ఉండగా దాడికి పాల్పడిన కానిస్టేబుల్ జగదీశ్ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో జగదీశ్ ఒక్కడే ఉన్నాడా లేక మరి కొంతమంది ఉన్నారా అనేది పోలీసులు విచారిస్తున్నారు. అయితే మహిళా కానిస్టేబుల్ అయిన జగదీశ్ భార్యతో పాటు మరో యువకుడు పరారీలో ఉన్నట్లు సమాచారం. వారి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది. వారిద్దరిని అదుపులోకి తీసుకుంటే తప్ప అసలు విషయం బయటికి వచ్చే అవకాశం ఉందని పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఘటనపై ఎస్పీతో పాటు పోలీస్ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News