Wednesday, January 22, 2025

రాష్ట్రంలో అద్భుతమైన పర్యాటక ప్రదేశంగా మహబూబ్‌నగర్

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్ : జిల్లా కేంద్రంలోని కెసిఆర్ అర్భన్ ఎకో పార్క్‌లో రాబోయే 4 నెలల్లో ప్రసిద్ద వారణాసి టెంట్ సిటీ తరహాలో ఇక్కడ కూడా అత్యుద్భుతంగా టెంట్ సిటీని ప్రారంభిస్తారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డా. వి. శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. వారణాసిలో ఉన్న ప్రఖ్యాత టెంట్ సిటీ నిర్వాహకులు లల్లూజీ అండ్ సన్స్ గ్రూప్ ప్రతినిధులతో కలిసి బుధవారం ఎకో పార్కులో టెంట్ సిటీ ఏర్పాటు కోసం స్థల పరిశీలన చేశారు. మొదటి దశలో 20 లగ్జరీ టెంట్ హౌస్‌లతో పాటు రెస్టారెంట్ , అడ్వెంచర్ స్పోర్ట్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వివరించారు.

రెండో దశలో ఉడెన్ కాటేజెస్ కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. దేశంలోనే అతి పెద్దదైన ఎకో పార్కులో పర్యాటకులను ఈ టెంట్ సీటీ ఎంతగానో ఆకట్టుకుంటుందని ఆయన అన్నారు. సాధ్యమైనంత త్వరగా టెండర్లను ఆహ్వానిస్తున్నామని ప్రఖ్యాత వారణాసి టెంట్ సీటీ నిర్వహిస్తున్న లల్లూజీ అండ్ సన్స్ గ్రూప్ సాధ్యమైనంత త్వరలోనే టెంట్ సిటీని అందుబాటులోకి తెస్తుందని తెలిపారు. రాష్ట్రంలో మహబూబ్‌నగర్ అతిపెద్ద పర్యాటక ప్రాంతంగా మారనుందని మంత్రి వివరించారు. పర్యాటక శాఖ ఓఎస్డీ సత్యనారాయణ, లల్లూజీ అండ్ సన్స్ గ్రూపు బిజినెస్ హెడ్ సిద్దార్థ మంత్రి వెంట ఎకో పార్కులో పర్యటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News