Monday, January 20, 2025

నేడు మహబూబ్‌నగర్ ఎంఎల్‌సి ఎన్నికల పోరు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ మహబూబ్‌నగర్ బ్యూరో : మహబూబ్ నగర్ స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికల పోలింగ్ గురువారం జరుగనుంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఎన్నికల అధికారులు పూర్తి చేశారు. పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులను తరలించారు. పోలింగ్ ప్ర శాంతంగా జరిగేలా పోలీసులు పటిష్టమైన భద్రతా చేశారు. ఈ ఎన్నికల్లో జడ్‌పిటిసిలు, ఎంపిపిలు, ఎంపిటిసిలు, ము న్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులైన1,439 మంది ఓటర్లుగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశా రు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి జోనల్ అధికారు లు, రూట్ అధికారులు,సెక్టార్ అధికారులు, పిఒ, ఎపిఒలు పర్యవేక్షిస్తారు. బుధవారం పోలింగ్ బాక్సులను ఆయా పో లింగ్ కేంద్రాలకు తరలించారు. ఓటరు గుర్తింపుకు ఎపిక్ కార్డు, లేదా స్థానిక సంస్థల గుర్తింపు కార్డు, ఎన్నికల సం ఘం నిర్దేశించిన గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చునని అధికారులు తెలిపారు. పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. ఏప్రిల్ 2వ తేదీన ఎంఎల్‌సి కౌంటింగ్ ఉంటుంది.

ద్విముఖ పోటీ : ఎంఎల్‌సి ఎన్నికల్లో ప్రధానంగా బిఆర్‌ఎ స్, కాంగ్రెస్ మధ్యనే పోటీ నెలకొంది. ఎంఎల్‌సి కసిరెడ్డి నా రాయణ రెడ్డి రాజీనామా చేయడంతో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎంఎస్‌ఎన్ ఫా ర్మా అధినేత మన్నె జీవన్ రెడ్డి పోటీలో ఉండగా, బిఆర్‌ఎస్ నుంచి రియల్టర్ నవీన్ రెడ్డి పోటీలో ఉన్నారు. వీరిద్దరి మ ధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. మొత్తం1,439 మంది ఓటర్లలో బిఆర్‌ఎస్‌కు మెజార్టీ సభ్యులు దాదాపు 800 దాకా ఉ న్నారు. అయితే, మూడు నెలల క్రితం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో ఈ ఎన్నిక సవాల్‌గా మారనుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరగుతున్న మొద టి ఎన్నికలు కావడం, సిఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కావడంతో ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మా రాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఆపరేషన్ నిర్వహించి అనే క మంది బిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులను చేర్చుకుంది. బిజె పి, ఇతర పార్టీలకు చెందిన వారు కూడా కాంగ్రెస్‌కు మద్ద తు ఇస్తున్నారు. మహబూబ్‌నగర్, గద్వాల మున్సిపల్ చైర్మ న్లు, కౌన్సిలర్లు అనేక మంది కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నా రు. నాగర్‌కర్నూల్ మినహా అన్ని జిల్లాల జడ్‌పి చైర్మన్లు కాంగ్రెస్ గూటికి చేరారు. ఇలా కాంగ్రెస్ ఆపరేషన్‌తో బిఆర్‌ఎస్‌కు పెద్ద షాక్ తగిలింది.

బిఆర్‌ఎస్ క్యాంపులు సక్సెస్ అయ్యేనా ?
కాంగ్రెస్‌ను గెలవకుండా చేసేందుకు బిఆర్‌ఎస్ గోవాలో క్యాంపు రాజకీయాలు ప్రారంభించింది. బిఆర్‌ఎస్‌కు చెందిన ప్రజాప్రతినిధులను గోవాకు తరలించి వారికి విందులు ఏర్పాట్లు చేసింది. చివరికి బిఆర్‌ఎస్ అధినేత కెటిఆర్ కూడా గోవాకు వెళ్లి బిఆర్‌ఎస్ అభ్యర్థిని ఎంఎల్‌సిగా గెలిపించాలని కోరారు. బిఆర్‌ఎస్ మాజీ ఎంఎల్‌ఎలు అందరూ గోవాలో తిష్ట వేసి బిఆర్‌ఎస్ గెలుపునకు కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం జరిగే పోలింగ్‌కు బిఆర్‌ఎస్ ప్రతినిధులను నేరుగా పోలింగ్ కేంద్రాలకు తరలించాలని ఆ పార్టీ అధిష్ఠానం భావిస్తోంది. అయితే కాంగ్రెస్ కూడా గెలుస్తామనే ధీమాతో ఉంది. బిఆర్‌ఎస్‌లోని ప్రజాప్రతినిధులతో ఇప్పటికే వారి బంధువుల ద్వారా టచ్‌లో ఉండడంతో వారి ఓట్లు కాంగ్రెస్‌కు పడతాయనే నమ్మకంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఎంఎల్‌సి ఎన్నికల్లో గెలుపు ఎవరన్నది అంతు చిక్కడం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News