- Advertisement -
హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీరామ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. ఏనుగొండ-శ్రీరామ్ కాలనీ వద్ద తండ్రి, కూతురు ఆత్మహత్య చేసుకున్నారు. శివానంద్(50), చందన(20) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఎస్‌విఎస్ ఆస్పత్రిలో కారు డ్రైవర్‌గా శివానంద్, ల్యాబ్ టెక్సిషియన్‌గా చందన ఉద్యోగం చేస్తున్నారు. కుటుంబ కలహాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. మృతులు వికారాబాద్ జిల్లా వాసులుగా గుర్తించారు.
- Advertisement -