Monday, December 23, 2024

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మహేందర్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : సమాచార,భూగర్భ వనరుల, గనుల శాఖ మంత్రిగా పట్నం మహేందర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. బుధవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం మొదటి అంతస్తులో మంత్రి కార్యాలయంలో కుటుంబ సభ్యులు వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పట్నం సునీతారెడ్డి, కుమారుడు పట్నం రినీష్ రెడ్డి లతో కలిసి పూజల అనంతరం మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సమాచార శాఖ కమిషనర్ అశోక్ రెడ్డి ముందు ఉంచిన తొలి ఫైల్ పై మంత్రి మహేందర్‌రెడ్డి సంతకం చేశారు.

ఈ సందర్భంగా మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు,ఎంపి గడ్డం రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు పట్నం నరేందర్‌రెడ్డి, అంజయ్యయాదవ్, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ప్రకాశ్ గౌడ్, కాలే యాదయ్య, కృష్ణారావు, బాల్క సుమన్, ఎమ్మెల్సీ శంగిపూర్ రాజు, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, జర్నలిస్టులు హజారీ, మారుతిసాగర్, బసవపున్నయ్య, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో మంత్రి మహేందర్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News