Monday, December 23, 2024

ధోనీ అకాడమీ ఆధ్వర్యంలో స్కూల్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్: మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్ అకాడమీ (ఎంఎస్‌డిసి) ఆధ్వర్యంలో స్కూల్ ప్రీమియర్ లీగ్ టి20 టోర్నమెంట్‌ను నిర్వహించనున్నారు. ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పోటీ పడనున్నా యి. గురువారం నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో గల ధోనీ క్రికెట్ అకడామీలో ఏ ర్పాటు చేసిన మీడియా సమావేశంలో లీగ్ కు సంబంధించిన వివరాలను 7హెచ్‌ఎస్ స్పోర్ట్ సంస్థ డైరెక్టర్ బి.వెంకటేష్ వెల్లడించారు. ప్రతిభావంతులైన క్రికెటర్లను వెలుగులోకి తేవాలనే ఉద్దేశంతో ఈ లీగ్‌ను నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

ప్రతిభావంతులైన క్రికెటర్లను మరింత మెరుగైన ఆటగాళ్లుగా తీర్చిదిద్దేందుకు పల్లవి ఫౌండేషన్ ఐదు ల క్షల రూపాయల స్కాలర్‌షిప్‌ను ప్రకటించింది. ఈ విషయాన్ని పల్లవి, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (నాచారం) విద్యా సంస్థల సిఇఓ మల్కా యశస్వి వెల్లడించారు. ధోనీ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో స్కూల్ లీగ్ టోర్నమెంట్‌ను నిర్వహించడంపై హర్షం వ్యక్తం చేశారు. యువ ఆటగాళ్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూ చించారు. కాగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలోని ధోనీ అకాడమీల అధీకృత భాగస్వామైన బ్రైనియాక్స్ బి డైరెక్టర్ రషీద్ బాషా మాట్లాడుతూ మారుమూల ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులైన క్రికెటర్లను గుర్తించి వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఏర్పడిందే ధోనీ అకాడమీ అని పేర్కొన్నారు.

బాలుర అండర్14, బాలికల అండర్16 కేటగిరీల్లో స్కూల్ లీగ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు.లీగ్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఐదుగురు క్రికెటర్లకు హైదరాబాద్‌లోని ధోనీ అకాడమీలలో ఉచితన శిక్షణ అందిస్తామని ప్రకటించారు. ఇదిలావుంటే లీగ్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్లు గురువారం ప్రారంభమయ్యాయి. ఆ గస్టు 17వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఆగస్టు 20న ఎంఎస్‌డిసిఎ సెంటర్లలో ట్రయల్స్ నిర్వహిస్తారు. ఆగస్టు 25 జట్ల పేర్లను ప్రకటిస్తారు. ఆగస్టు 27 నుంచి లీగ్ మ్యాచ్‌లు ఆరంభమవుతాయి. సెప్టెంబర్ 3న ఫైనల్ జరుగుతుంది. కాగా, రిజిస్ట్రేషన్లకు సంబంధించిన వివరాల కోసం 73963 86214/ 76187 03508 నెం బర్లను సంప్రదించాలని టోర్నీ నిర్వాహకు లు కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News