Monday, December 23, 2024

’అలాంటి మాస్ క్యారెక్టర్ మళ్లీ కుదిరింది..

- Advertisement -
- Advertisement -

 Mahesh Babu about Sarkaru Vaari Paata

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ’సర్కారు వారి పాట’ కోసం ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. పరశురాం దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా అంచనాలని మరో స్థాయికి తీసుకెళ్లింది థియేట్రికల్ ట్రైలర్. ఇక ‘సర్కారు వారి పాట’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈనెల 12న విడుదలకు సిద్దమవుతోంది. ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్‌బాబు మీడియాతో మాట్లాడుతూ చెప్పిన విశేషాలు…
ప్రతీది కొత్తగా…
‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని దర్శకుడు పరశురాం అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా క్రెడిట్ మొత్తం అతనికే దక్కుతుంది. దర్శకుడు నా పాత్రని చాలా కొత్తగా డిజైన్ చేశారు. చాలా ఎంజాయ్ చేసి పని చేశాను. ‘పోకిరి’ రోజులు గుర్తుకు వచ్చాయి. బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ .. ఇలా ప్రతీది కొత్తగా వుంటుంది. ‘సర్కారు వారి పాట’ విజయవంతమైన సినిమా అవుతుంది.
అలాంటి మాస్ క్యారెక్టర్…
‘సర్కారు వారి పాట’లో నా క్యారెక్టర్ ‘పోకిరి’ లెవెల్‌లో వుంటుంది. ‘పోకిరి’ షేడ్స్‌లో ఉన్న క్యారెక్టర్ మళ్ళీ దొరికింది. అలాంటి మాస్ క్యారెక్టర్ మళ్ళీ ‘సర్కారు వారి పాట’తో కుదిరింది.
మరో ఆలోచన లేకుండా…
పరశురాం తెరకెక్కించిన ‘గీత గోవిందం’ నాకు చాలా నచ్చింది. అతను ‘సర్కారు వారి పాట’ కథ చెప్పినపుడు చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. మరో ఆలోచన లేకుండా సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. పరాశురాం అద్భుతమైన రచయిత. అంత అద్భుతమైన రచయిత దర్శకుడైతే అద్భుతంగా వుంటుంది. కథ ఫస్ట్ హాఫ్ యుఎస్‌లో మొదలై .. సెకండ్ హాఫ్ వైజాగ్‌కి వస్తుంది.
ఆ పాట ఓ హైలైట్‌గా…
సినిమా ఫ్లోకు అనుగుణంగా ఒక మాస్ సాంగ్ అయితే బావుంటుందని టీం మొత్తం ఓ నిర్ణయానికి వచ్చాం. తమన్ ‘మమా మహేష్ ..’ పాట ట్యూన్ వినిపించారు. చాలా ఎనర్జిటిక్‌గా అనిపించింది. పది రోజుల్లో ఒక భారీ సెట్ వేసి షూట్ చేశాం. పాట అద్భుతంగా వచ్చింది. ఈ సినిమాలో ‘మమ మహేష్’ పాట ఒక హైలెట్‌గా ఉండబోతుంది.
కథ నుంచే టైటిల్…
దర్శకుడు పరశురాం మొదట టైటిల్ చెప్పలేదు. కథ నుంచే టైటిల్ పుట్టింది. ‘సర్కారు వారి పాట’ అని ఆయన చెప్పిన వెంటనే నాకు నచ్చేసింది. మరో ఆలోచన లేకుండా ఈ టైటిల్ ఫిక్స్ చేయమని చెప్పాను.
లవ్ ట్రాక్ హైలైట్‌గా…
హీరోయిన్ కీర్తి సురేష్ ఈ సినిమాలో ఇరగదీసింది. ‘సర్కారు వారి పాట’లో కీర్తి పాత్ర చాలా సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది. మా ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ మెయిన్ హైలెట్. ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు.
అదే జరిగింది…
తమన్ మ్యూజికల్ సెన్సేషన్. ఈ సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. కళావతి పాట నా కెరీర్‌లోనే బెస్ట్ సాంగ్‌గా నిలిచింది. ట్యూన్ ఇచ్చినపుడు ఈ పాట ఇంత పెద్ద హిట్ అవుతుందని అనుకోలేదు. అయితే తమన్ బలంగా నమ్మాడు. ప్రతి పెళ్లిలో ఇదే పాట వినిపిస్తుందని చెప్పాడు. అదే జరిగింది. మిగతా పాటలు కూడా అద్భుతంగా వచ్చాయి. రీరికార్డింగ్ కూడా అదరగొట్టాడు.
ఫైట్స్ అద్భుతంగా…
రామ్-లక్ష్మణ్ నా ఫేవరేట్ ఫైట్ మాస్టర్స్. ప్రతి సినిమాని కొత్తగా డిజైన్ చేస్తారు. అలాగే ఫైట్ తీస్తున్నపుడు హీరోతో పాటు అందరినీ చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఈ సినిమాలో ఫైట్స్ అద్భుతంగా ఉంటాయి.
అది పాన్ ఇండియా సినిమానే…
ప్రస్తుతం నా దృష్టి అంతా తెలుగు సినిమాలపైనే వుంది. తెలుగు సినిమానే బాలీవుడ్‌కి రీచ్ కావాలని కోరుకుంటాను. ఇక నేను, రాజమౌళి సినిమా చేస్తే పాన్ ఇండియా సినిమానే అవుతుంది. నేను చేసే సినిమా అభిమానులతో పాటు అందరికీ నచ్చాలి. అందరికీ నచ్చే సినిమా చేయాలనే వుంటుంది. అయితే భారీ బడ్జెట్ తో పూర్తిగా ప్రయోగాత్మక సినిమాలు కూడా చేయలేం. అందరూ మెచ్చే సినిమా చేసే దిశగానే కష్టపడుతుంటా.
ఆతృతగా ఎదురుచూస్తున్నా…
చాలా గ్యాప్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయబోయే సినిమా చాలా కొత్తగా ఉండబోతుంది. మా కాంబినేషన్ అంటేనే డిఫరెంట్ లెవల్‌లో వుంటుంది. ఆయన అద్భుతమైన రచయిత. ఆయన రాసిన డైలాగ్ నేను పలుకుతుంటే ఆ కిక్కే వేరు. ఆయన సినిమా కోసం చాలా ఆతృతగా ఎదురుచుస్తున్నా.

 Mahesh Babu about Sarkaru Vaari Paata

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News