దర్శకదీరుడు రాజమౌళి, సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో రాబోతోన్న సినిమా లాంచింగ్ అప్‌డేట్ కోసం మహేష్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని ఫ్లాష్ బ్యాక్‌పై ఓ క్రేజీ గాసిప్ వినిపిస్తోంది. ఈ ఫ్లాష్ బ్యాక్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు పూర్తిగా రఫ్ అండ్ రగ్గుడ్ లుక్‌లో కనిపిస్తాడని.. మహేష్ కెరీర్‌లోనే సరికొత్త గెటప్‌లో అలరించనున్నాడని టాక్ నడుస్తోంది. ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే సీన్స్‌లో మహేష్ బాబు లుక్ ఎలా ఉంటుందో తెలియదు గానీ, ఈ న్యూస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఎంతైనా మహేష్ రగ్గుడ్ లుక్ అంటే నిజంగా సర్‌ప్రైజింగ్ ఎలిమెంటే. ప్రస్తుతం ప్రముఖ మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా ఈ చిత్రానికి మాటలు రాస్తున్నారు. కాగా ఆఫ్రికా బ్యాక్‌డ్రాప్‌లో అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ఈ కథా నేపథ్యం సాగుతుందని తెలుస్తోంది. ఆ మధ్య విజయేంద్రప్రసాద్ ఈ సినిమా కథ గురించి ఓ ఇంటర్వ్యూలో చెబుతూ.. ‘నేను, రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్ స్మిత్‌కు పెద్ద అభిమానులం. అందుకే, ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్‌ను రాయాలనుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు. రాజమౌళి ఇప్పటికే ఈ మూవీ లొకేషన్లను కూడా ఫైనల్ చేశాడు. ప్రీప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తి కావడంతో ఇక సినిమా షూటింగ్ ప్రారంభం కావడమే మిగిలింది.
పక్కా మాస్..
- Advertisement -
- Advertisement -
- Advertisement -