Wednesday, January 22, 2025

రాజమౌళితో మూవీ ఆగస్టు నుంచి..

- Advertisement -
- Advertisement -

ప్రస్తుతం ఇండియన్ సినిమా సహా వరల్డ్ మూవీ లవర్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఇండియన్ సినిమా ఏదన్నా ఉందంటే అది సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే దర్శక దిగ్గజం ఎస్‌ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమానే అని చెప్పాలి. ఈ భారీ చిత్రం మహేష్ బాబు కెరీర్‌లో 29వ సినిమాగా రాబోతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం కోసం మహేశ్ బాబు కొత్త లుక్‌లోకి మారుతున్నాడు. ఈ లుక్‌లో మహేశ్‌ను చూసి అభిమానులు ఎంతో సంబరపడిపోతున్నారు. గడ్డం పెంచి లాంగ్ హెయిర్‌లోని మహేశ్ డైనమిక్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహేష్ బాబు బాబాయ్, కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు తాజాగా ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ‘ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో ఉంది. ఈ మూవీ ఆగస్టులో ప్రారంభం అవుతుంది. అదే నెలలోనే షూటింగ్ మొదలవుతుంది’ అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News