Saturday, January 4, 2025

మార్చిలో మహేష్ బాబు షూటింగ్ షురూ

- Advertisement -
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు – రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రం త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సినిమా 2024లోనే మొదలవుతుందని భావించారు. కానీ రాజమౌళి నెమ్మదిగా ప్రీ-ప్రొడక్షన్ పనులు చేశారు. తాజాగా రాజమౌళి విశాఖ సమీపంలోని బొర్రా గుహలను సందర్శించారు. అక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాలు తీసే ఆలోచనలో ఉన్నారని సమాచారం. రాజమౌళి ఇటీవల కెన్యా కూడా వెళ్లారు. అక్కడ కొన్ని లొకేషన్లను ఎంపిక చేశారు. ఈ సినిమాని అడ్వెంచర్ థ్రిల్లర్‌గా తీయనున్నారు.

అందుకే ఇలాంటి లొకేషన్లు వెతుకుతున్నారు. ఆఫ్రికాకి చెందిన విల్బర్ స్మిత్ రాసిన నవలల ఆధారంగా రాజమౌళి ఈ సినిమాని తీస్తున్నారు. మహేష్ బాబు ఇందులో ఇండియానా జోన్స్ తరహా పాత్రలో కనిపిస్తారు. రాజమౌళి ఈ సినిమా కోసం ప్రియాంక చోప్రాని తీసుకోవాలని భావిస్తున్నారు అని బాలీవుడ్ మీడియా కథనాలు. కీరవాణి సంగీతం అందించే ఈ సినిమాలో హాలీవుడ్ తారలు కూడా నటిస్తారు. ఈ ఏడాది కాలంలో ఆయన రాజమౌళితో ప్రయాణిస్తూ స్క్రిప్ట్ చర్చల్లో పాల్గొన్నారు. అంతేకాకుండా లుక్ టెస్ట్ కోసం వర్క్ షాప్‌లోనూ పాల్గొన్నారు.

రాజమౌళితో సినిమా కోసం మహేష్ బాబు మొత్తంగా మూడు ఏళ్లు కేటాయించాల్సి రావచ్చు అంటున్నారు. మహేష్ బాబుతో రాజమౌళి తీయబోతున్న సినిమాను రెండు పార్ట్‌లుగా ప్లా న్ చేస్తున్నారు. యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ 2025 మార్చిలో ప్రా రంభం కానుంది. మొదటి పార్ట్‌ను 2026లో, రెండో పార్ట్‌ను 2028లో విడుదల చేస్తారనే వార్తలు వస్తున్నాయి. అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News