Wednesday, January 22, 2025

ఎమోషన్ గా ఫీల్ అయిన మహేశ్ బాబు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నటుడు మహేశ్ బాబు, ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్ తమ కుమారుడు ఘట్టమనేని గౌతమ్ గ్రాడ్యుయేషన్ డే నాడు చాలా ఎమోషన్ గా ఫీలయ్యారు. వారు ఆదివారం తమ ఇన్ స్టాగ్రామ్ లో ఆ సందర్భానికి సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేశారు.

మహేశ్ బాబు కుమారుడు హైదరాబాద్ లోని ఐఎస్ హెచ్ లో చదువుకుని గ్రాడ్యుయేట్ అయ్యారు.

గౌతమ్ న్యూయార్క్ యూనివర్శిటీలో పై చదువులు చదువుతారని నమ్రతా శిరోద్కర్ అన్నారు. మహేశ్ బాబు తన పోస్ట్ లో ‘‘నా గుండె గర్వంగా కొట్టుకుంటోంది. గ్రాడ్యుయేట్ అయినందుకు గర్వంగా ఉంది కుమార ! తదుపరి అధ్యాయాన్ని నువ్వే రాయాలి. నువ్వు ఇదివరకటి కంటే మరింతగా వెలుగొందుతావని నాకు తెలుసు. నీ స్వప్నాలను నెరవేర్చుకోడానికి ప్రయత్నించు. నీవు నాకు ఎప్పుడు ఇస్టమైన వాడివే. నేను నేడు తండ్రిగా గర్విస్తున్నాను’’ అని పోస్ట్ చేశాడు.

Mahesh Post

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News