హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో 119 మంది సభ్యులను ఎన్నుకోవడానికి పోలింగ్ జరుగుతోంది. గురువారం గట్టి భద్రత మధ్య ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి క్యూలో ఉన్నారు. ఓటేసేందుకు తరలివచ్చిన ప్రముఖులు లైన్లో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాధారణ ఓటర్లలో చైతన్యం కల్పించే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ లో రాజకీయ, సినీ తారలు తమ ఓటును వినియోగించుకుంటున్నారు. గురువారం జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ పోలింగ్ బూత్ నంబర్ 165లో టాలీవుడ్ ప్రముఖ హీరో మహేశ్ బాబు, నమ్రత దంపతులు, మంచు మోహన్‌బాబు, విష్ణు, లక్ష్మి, మనోజ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎఫ్ఎన్‌సిసి పోలింగ్ బూత్ 164లో జీవిత రాజశేఖర్ దంపతులు, రాఘవేంద్రరావు ఓటు వేశారు.
తెలంగాణలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోరు నడుస్తోంది. బిఆర్‌ఎస్ వరుసగా మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా, కాంగ్రెస్ మాత్రం అధికారాన్ని చేజిక్కించుకునేందుకు తీవ్రంగా పోరాడుతోంది. బిఆర్‌ఎస్ మొత్తం 119 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. సీట్ల పంపకాల ఒప్పందం ప్రకారం బిజెపి 111, జనసేన 8 స్థానాల్లో పోటీ చేయగా, కాంగ్రెస్ మిత్రపక్షమైన సీపీఎంకు ఒక సీటు ఇచ్చింది. అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం నగరంలోని తొమ్మిది సెగ్మెంట్లలో అభ్యర్థులను నిలబెట్టింది.
#WATCH | Telangana Elections | Actor Mahesh Babu cast his vote at a polling booth in Jubilee Hills, Hyderabad today. pic.twitter.com/SrsJky2FDk
— ANI (@ANI) November 30, 2023