Saturday, December 28, 2024

కృష్ణపై మహేష్ భావోద్వేగ పోస్ట్..

- Advertisement -
- Advertisement -

కొన్ని రోజులు క్రితం సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ విషాదంతో ఘట్టమనేని వారి ఇంట తీవ్ర విషాదం నెలకొనగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంతో ఆవేదన చెందారు. ఈ నేపథ్యంలో కృష్ణ మృతిపై ఆయన కుమారుడు మహేశ్ బాబు తాజాగా భావోద్వేగంగా స్పందిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. “మీ జీవితం ఓ ఉత్సవం… మీ నిష్క్రమణం కూడా అంతకుమించిన వేడుకే. అదీ మీ ఔన్నత్యం. నిర్భయంగా జీవించారు మీరు. డేరింగ్ అండ్ డాషింగ్ మీ తత్వంగా బ్రతికారు.

మీరు అకస్మాత్తుగా  దూరం కావడంతో నా స్ఫూర్తి, నా ధైర్యం… ఇంకా ఏ ఉన్నత విలువలు నాకు అత్యంత ముఖ్యమనుకున్నానో… అవన్నీ క్షణంలో మాయమైపోయాయి. కానీ చిత్రంగా, అంతకు ముందెన్నడూ లేని బలం ఇప్పుడు నాకు అనుభవంలోకి వచ్చింది. నేనిప్పుడు నిర్భయుడిని…. మీ జ్యోతి వెలిగిస్తుంది నన్ను ఎప్పటికీ. మీ వారసత్వాన్ని మున్ముందుకు తీసికెళ్తాను. మీరు మరింత గర్వపడేలా చేస్తాను. లవ్ యూ నాన్న, మీరే నా సూపర్ స్టార్‌” అని మహేశ్ బాబు ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు.

Mahesh Babu emotional post on his late father Krishna

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News