Monday, December 23, 2024

తండ్రి బాటలో తనయ..

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు వరుస సినిమాలు, కుటుంబంతో బిజీగా ఉండే ఆయన.. మరోవైపు సామాజిక సేవ చేస్తుంటారు. ప్రాణాపాయస్థితిలో ఉన్న ఎందరో చిన్నారులకు తన వంతు సాయం చేస్తుంటారు. మహేశ్‌ బాబు ఫౌండేషన్‌ ద్వారా ఆంధ్రా హాస్పిటల్స్‌ సహకారంతో ఇప్పటికే వందలాది మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించారు. సినిమాల్లోనే కాదు.. నిజజీవితంలోనూ మహేష్ హీరోనే. సినీ హీరోగా మాత్రమే కాకుండా మనసున్న వ్యక్తిగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. సొంతూరు బుర్రిపాలెంతో పాటు తెలంగాణలోని సిద్ధాపూర్ గ్రామాన్ని కూడా మహేశ్ బాబు దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నారు. కొత్త ఏడాది సందర్భంగా మహేశ్‌ మరో అడుగు ముందుకేశారు.

తన సేవా కార్యక్రమాలను మరింత విస్తరించేందుకు కొత్త వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. మహేశ్ బాబు ఫౌండేషన్ డాట్ ఆర్గ్ (http://maheshbabufoundation.org) పేరుతో ఈ వెబ్‌సైట్‌ను తీసుకువచ్చారు. పిల్లల కోసం నూతన సంవత్సరాది రోజున ఈ వెబ్‌సైట్ ప్రారంభిస్తున్నట్టు మహేశ్ కూతురు సితార ఘట్టమనేని వెల్లడించింది. కొత్త ఏడాది ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ తన సందేశాన్ని ట్విట్టర్‌లో తెలిపింది. ఈ నెల తన పాకెట్ మనీని మహేశ్ బాబు ఫౌండేషన్‌కు విరాళంగా ఇస్తున్నట్లు తెలిపింది.  పిల్లల కోసం మరింత మెరుగైన ప్రపంచాన్ని సృష్టిద్దామని కోరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News