Wednesday, January 22, 2025

జర్మనీకి వెళ్లిన మహేష్‌బాబు…. అతడి కోసమేనా?

- Advertisement -
- Advertisement -

బెర్లీన్: సినిమాలు విడుదలైన తరువాత ప్రిన్స్ మహేష్ బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లి విశ్రాంతి తీసుకుంటాడు. ‘గుంటూరు కారం’ సినిమా విడుదల చేసిన తరువాత అతడొక్కడే కొద్దీ రోజుల క్రితం జర్మనీకి వెళ్లాడు. మహేష్‌బాబు ఒక్కడే వెళ్లడంతో వార్తలు షికార్లు చేశాయి. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమాల్లో మహేష్ బాబు నటిస్తున్న విషయం తెలిసిందే. ఎస్‌ఎస్‌ఎంబి 29 త్వరలో తెరపైకి రానుంది. తన లుక్, మేకోవర్ సంబంధించిన సాంకేతికపరమైన విషయాల గురించి వెళ్లారని వార్తలు వైరల్‌గా మారాయి. ఒక ఫొటో బయటకు రావడంతో మహేష్ జర్మనీ ఎందుకు వెళ్లారో తెలిసింది. జర్మనీలో ఫేమస్ డాక్టర్‌ను కలుసుకునేందుకు వెళ్లాడు.

గతంలో పలుమార్లు ఆ డాక్టర్‌ను మహేష్ కలుసుకున్నాడు. ఆ డాక్టర్ దగ్గర మహేష్ దేని గురించి చికిత్స తీసుకుంటున్నాడనేది అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. జర్మనీలో హరీ కోనిగ్ అనే వైద్యుడు ఫిటినెస్‌కు సంబంధించిన డాక్టర్. మహేష్‌బాబు ఎక్కువగా తన బాడీ ఫిట్‌నెస్ శ్రద్ధ చూపుతాడు. గుంటూరు కారం సినిమా నుంచి రాజమౌళి సినిమా కోసం కసరత్తులు ప్రారంభించాడు. ఆ వర్కౌట్ ఫొటోలు అప్పడప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తున్న విషయం తెలిసిందే. రాజమౌళి సినిమా కోసం తాను కసరత్తులు చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాకు సంబంధించి కథ వర్క్ పూర్తి చేశామని జక్కన్న తండ్రి రచయిత విజయేంద్ర ప్రసాద్ తెలిపాడు. వేసవి నుంచే ఈ సినిమా షూటింగ్ జరుగుతుందని ఫిల్మ్ సిటీ వర్గాలు అంచనాకు వచ్చాయి.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News