Wednesday, January 22, 2025

మహేష్‌బాబు పెద్దమనసు: పేద విద్యార్థినికి చేయూత(వీడియో)

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: సూపర్‌స్టార్ మహేష్‌బాబు తన పెద్దమనసును మరోసారి చాటుకున్నారు. ఇగుండెజబ్బుతో బాధపడుతున్న పేదవారికి తన సొంత ఖర్చుతో హార్ట్ సర్జరీలు చేయించి తన మానవతా హృదయాన్ని అనేకసార్లు చాటుకున్న మహేష్‌బాబు తాగాజా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక పేద విద్యార్థినికి లాప్‌టాప్ బహూకరించడమేగాక ఆమె చదువుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందచేయడానికి కూడా ముందుకు వచ్చారు.

మహేష్‌బాబు సతీమణి నమ్రత చేతుల మీదుగా మహేష్‌బాబు ఫౌండేషన్ తరఫున ఈ ఆర్థిక సహాయాన్ని ఆ విద్యార్థిని అందచేశారు. మహేష్‌బాబు దంపతుల దాతృత్వానికి ఆ పేద విద్యార్థిని తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియచేశారు. సాధికారత సాధించిన మహిళలు మహిళల సాధికారత కోసం కృషి చేయాల్సి ఉంటుందని ఈ సందర్భంగా నమ్రత ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా ట్విటర్‌లో షేర్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News