Friday, January 10, 2025

రాజమౌళి-మహేశ్ బాబు మూవీకి బడ్జెట్ ఎంతో తెలుసా?

- Advertisement -
- Advertisement -

రాజమౌళి పేరు చెబితేనే మగధీర, బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి భారీ సినిమాలు గుర్తుకువస్తాయి. క్రేజీ కాంబినేషన్లకు, అంతకుమించిన క్రేజీ సెట్టింగులకు రాజమౌళి పెట్టింది పేరు. ఇప్పుడు ఈ భారీ చిత్రాల దర్శకుడు మరో మెగా మూవీని తీయబోతున్నాడు. పైగా ఎవరితోనో తెలుసా? సూపర్ స్టార్ మహేశ్ బాబుతో.

మహేశ్ బాబు- దర్శకుడు త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో రూపొందిన గుంటూరు కారం మూవీ ఈనెల 12న రిలీజ్ కాబోతోంది. అతడు, ఖలేజీ సినిమాల తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న గుంటూరు కారంపై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మహేశ్ బాబుతో రాజమౌళి తీయబోయే సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్ ఇప్పటికే మొదలయింది. మరొక టీమ్ లొకేషన్ల వేట మొదలుపెట్టిందట కూడా. ఏప్రిల్ లో షూటింగ్ మొదలు పెట్టేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ మూవీ కోసం రాజమౌళి ముందుగా ఒక వర్క్ షాప్ నిర్వహిస్తున్నాడట. దీనికి మహేశ్ బాబు కూడా హాజరవుతున్నట్లు సమాచారం.

మూడు దేశాల్లో ఈ సినిమా షూటింగ్ జరపాలన్నది రాజమౌళి ఆలోచనగా తెలుస్తోంది. మూవీలో కొంత భాగాన్ని అమెజాన్ అడవుల్లో కూడా చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారట. కేఎల్ నారాయణతోపాటు ఒక ప్రముఖ హాలీవుడ్ స్టూడియో కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించనున్నట్టు సమాచారం. బాహుబలి, ఆర్ఆర్ఆర్ ల తర్వాత రానున్న సినిమా కాబట్టి, బడ్జెట్ విషయంలో నిర్మాతలు రాజీపడటం లేదు. ఈ మూవీకి నిర్మాతలు రూ.1500 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News