Saturday, January 11, 2025

పాపులర్ పాత్రలలో ముఫాసా ఒకటి:మహేష్ బాబు

- Advertisement -
- Advertisement -

ది లయన్ కింగ్‌లో ముఫాసాకు వాయిస్ ఓవర్ ఇచ్చిన మహేష్ బాబు ఈ మూవీ, పాత్ర కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో తెలియజేశారు. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఈనెల 20న ఇండియాలో ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషలలో విడుదల కానుంది. బారీ జెంకిన్స్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం 2019లో లైవ్- యాక్షన్ ది లయన్ కింగ్ బ్లాక్‌బస్టర్ విజయాన్ని కొనసాగిస్తూ ప్రేక్షకులని అలరించబోతోంది. తెలుగు డబ్బింగ్ వర్షన్‌లో అభిమానుల కోసం ఒక స్పెషల్ ట్రీట్. ‘ముఫాసా’కి సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఇస్తున్నారు.

టాకా పాత్రకు హీరో సత్యదేవ్, టిమోన్ పాత్రకు అలీ, పుంబా పాత్రకు బ్రహ్మానందం, కిరోస్ పాత్రకు అయ్యప్ప పి శర్మ వాయిస్ అందించారు. ముఫాసా: ది లయన్ కింగ్‌కి వాయిస్ ఇవ్వడం గురించి మహేష్ బాబు మాట్లాడుతూ “ముఫాసా ఇప్పటివరకు వచ్చిన అత్యంత పాపులర్ పాత్రలలో ఒకటి. ఇది నాకు ఒక డ్రీం కం ట్రూగా భావిస్తున్నాను. నేను ఎప్పటి నుంచో చూస్తున్న పాత్రల్లో ఆయన ఒకరు. అతను తన కుటుంబాన్ని చూసుకునే విధానం అద్భుతం. నేను అతని పాత్రను చూడటానికి ఎదురుచూస్తున్నాను. ప్రేక్షకులు తమ కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూస్తారని భావిస్తున్నాను”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News