Friday, December 27, 2024

గుంటూరు కారంలో కొత్త మహేష్‌ను చూస్తారు..

- Advertisement -
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో తెరకెక్కిన సినిమా గుంటూరు కారం. ’అతడు’, ’ఖలేజా’ వంటి కల్ట్ క్లాసిక్ హిట్ సినిమాల తర్వాత రూపొందిన ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లో సూర్యదేవర రాధాకృష్ణ నిర్మించారు. శ్రీలీల హీరోయిన్‌గా నటించిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా ఈనెల 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.

ఈ సందర్భంగా గుంటూరులో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో సూపర్ స్టార్ మహేష్‌బాబు మాట్లాడుతూ “దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో నా ప్రయాణం అతడు సినిమాతో మొదలైంది. అనంతరం ఖలేజా సినిమాతో మ్యాజిక్ జరిగింది. అదే మ్యాజిక్ గుంటూరు కారం సినిమాలోనూ కనిపిస్తుంది. ఈ సినిమాలో కొత్త మహేష్‌బాబును చూస్తారు. ఇక నాకు, మా నాన్న (సూపర్ స్టార్ కృష్ణ)కు బాగా కలిసొచ్చిన పండగ సంక్రాంతి. ఈ సీజన్‌లో మా చిత్రం విడుదలైతే అది బ్లాక్‌బస్టరే. ఈసారి కూడా అదే రిపీట్ అవుతుంది. కానీ ఇప్పుడు నాన్న లేరు. ఆయన నా సినిమాలు చూసి రికార్డులు, కలెక్షన్ల గురించి చెబుతుంటే ఆనందించేవాడిని. ఇక నుంచి అభిమానులే ఆ సంగతులన్నీ చెప్పాలి. అభిమానులే నాకు అమ్మ, నాన్న”అని అన్నారు.

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ “ ఒక సినిమాకు వంద శాతం పనిచేయాలంటే రెండు వందల శాతం పనిచేసే హీరో మహేష్‌బాబు. ఈ సినిమాలో మహేష్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మైమరపిస్తారు. ఈనెల 12న ప్రేక్షకులు థియేటర్లలో ఈ సినిమాను చూసి సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను”అని తెలిపారు. ఈ వేడుకలో దిల్‌రాజు, మీనాక్షి చౌదరి, శ్రీలీల, తమన్‌తో పాటు చిత్ర బృందం పాల్గొంది.

టికెట్ ధరల పెంపునకు అనుమతి…
గుంటూరు కారం సినిమా టికెట్ ధరల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. సింగిల్ స్క్రీన్లలో రూ.65, మల్టీఫ్లెక్స్ థియేటర్లలో రూ.100 పెంపునకు అనుమతినివ్వడం జరిగింది. అదేవిధంగా గుంటూరు కారం సినిమా బెన్ ఫిట్ షోలకు అనుమతినిచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఈనెల 12న అర్థరాత్రి 1 గంట బెన్ ఫిట్ షోకు రాష్ట్రంలో 23 చోట్ల ప్రదర్శనలకు అనుమతినిచ్చారు. సినిమా ఆరో షో ప్రదర్శనకు కూడా అనుమతినిచ్చారు. ఈ నెల 12 నుంచి 18 వరకు ఉదయం 4 గంటల షోకు అనుమతివ్వడం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News