Wednesday, January 22, 2025

‘సర్కారు వారి పాట’ విజయం ఎప్పటికీ గుర్తిండిపోతుంది

- Advertisement -
- Advertisement -

Mahesh babu speech at Sarkaru Vaari Paata Success Meet

మహేష్ బాబు నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట’ను పరశురాం దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ‘సర్కారు వారి పాట’ మాస్ సక్సెస్ సెలబ్రేషన్స్‌ని కర్నూల్ లో ఘనంగా నిర్వహించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, తమన్, అనంత శ్రీరామ్ సహా చిత్ర యూనిట్ సభ్యులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ వేడుకలో సూపర్ స్టార్ మహేష్ బాబు స్టేజ్ పైకి వచ్చి డ్యాన్స్ చేయడం అభిమానులని అలరించింది. ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ “ఇది సక్సెస్ సెలబ్రేషన్‌లా లేదు. వంద రోజుల వేడుక చేసుకున్నట్లు వుంది. ‘సర్కారు వారి పాట’ విజయం ఎప్పటికీ గుర్తిండిపోతుంది. ఈ సినిమాను నాన్నగారు చూసి .. పోకిరి, దూకుడు చిత్రాలను మించిపొతుందని అన్నారు. ఈ క్రెడిట్ అంతా దర్శకుడు పరశురాంకి దక్కుతుంది” అని అన్నారు. దర్శకుడు పరశురాం మాట్లాడుతూ “మహేష్ బాబు ‘ఒక్కడు’ సినిమా చూసి డైరెక్టర్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చాను. మహేష్ బాబు సినిమాకు దర్శకత్వం వహించి, సినిమా విజయోత్సవం కర్నూల్‌లో జరుపుకోవడం అనేది నాకు లైఫ్‌టైమ్ గిఫ్ట్. మహేష్‌కి మంచి సినిమా ఇస్తానని మాటిచ్చాను. ఆ మాట ‘సర్కారు వారి పాట’తో నిలబెట్టుకోవడం చాలా ఆనందంగా ఉంది” అని తెలిపారు.

Mahesh babu speech at Sarkaru Vaari Paata Success Meet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News