Monday, January 20, 2025

నేను రణ్‌బీర్‌కు అభిమానిని: మహేష్ బాబు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వంగా సందీప్ రెడ్డి దర్శకత్వంలో ‘యానిమల్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ నటిస్తుండగా ఆయన తోడుగా రష్మిక మందనా నటిస్తున్నారు. హైదరాబాద్‌లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకకు దర్శకుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు, అనిల్ కపూర్, ప్రణయ్, భూషణ్ కుమార్, మంత్రి మల్లారెడ్డి, సినీ ప్రముఖులు, బాబీ డేఓల్, తదితరలు హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో మహేష్‌బాబు మాట్లాడారు. యానిమల్ ట్రైలర్ చూశానని, రణ్‌బీర్ నటన చూసిన తనకు రోమాలు నిక్కబొడుచుకున్నాయని, ట్రైలర్ బాగుందని కితాబిచ్చాడు. దర్శకుడు సందీప్ రెడ్డి అంటే తనకు చాలా ఇష్టమని, ఆయన చిత్రాలు ఎంతో ప్రత్యేకంగా ఉంటాయని, ప్రీ రిలీజ్ ఈవెంట్ చూస్తుంటే వంద రోజుల వేడుకల ఉందని ప్రశంసించారు. రణ్‌బీర్‌కు తాను అభిమానిని అని, మన దేశంలో అత్యుత్తమ నటుల్లో ఆయన ఒకరిగా నిలిచారని మహేష్‌బాబు కొనియాడారు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News