Sunday, January 5, 2025

14 ఏళ్ల క్రితం ట్వీట్ ఇప్పుడు నిజమైంది!

- Advertisement -
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి కలయికలో రూపొందుతున్న బిగ్గెస్ట్ మూవీపై దేశ, విదేశాల్లోని ప్రేక్షకులు, అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. మహేష్ కెరీర్‌లో 29వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం తాజాగా పూజా కార్యక్రమాలతో మొదలైన సంగతి తెలిసిందే. అసలు ఈ కాంబినేషన్ ఎన్నో ఏళ్ళు నుంచి అనుకుంటున్నప్పటికీ, చివరికి సెట్ అయి ఇప్పుడు సినిమా రూపొందుతోంది. ఈ సందర్భంలో మహేష్ బాబు… రాజమౌళితో సినిమా కోసం చేసిన ఓ పాత ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.

అది 2010 సంవత్సరం మే 22న మహేష్ బాబు… రాజమౌళితో సినిమా చేస్తున్నట్టు అందరికీ అప్డేట్ అందించారు. ‘నిజంగా ఓ గుడ్ న్యూస్… నేను, రాజమౌళి సినిమా చేయబోతున్నాం. మొత్తానికి ఇద్దరం కలిసి ఫైనల్‌గా వర్క్ చేస్తున్నాం’ అంటూ చేసిన పోస్ట్‌ని ఫ్యాన్స్ వెతికి మరీ ఇపుడు హైలైట్ చేస్తూ ప్రస్తుత సందర్భానికి లింక్ చేసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సెన్సేషనల్ కలయికలో వస్తున్న సినిమా ఎలాంటి చరిత్ర సృష్టిస్తుందో చూడాల్సిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News