- Advertisement -
టాలీవుడ్‌లోని హ్యాండ్సమ్ హీరోలలో అందరికంటే సూపర్‌స్టార్ మహేష్‌బాబు ముందుంటారు. వరుస హిట్లతో దూసుకుపోతున్న మహేష్‌కు తెలుగు ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ ఉంది. ఇక ఈ స్టార్ హీరో భార్య నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. ఆమె తరచుగా సూపర్ స్టార్, పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తోన్న ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా మహేష్ బాబు స్విమ్మింగ్ పూల్‌లో షర్ట్ లేకుండా ఉన్న ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. దీనికి ‘కొన్ని శనివారం ఉదయాలు ఇలాగే ఉంటాయి’ అనే క్యాప్షన్ పెట్టారు. ఇంకేముంది.. వీటిని సూపర్ స్టార్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. ఈ ఫొటోలు తక్కువ సమయంలోనే జోరుగా వైరల్ అయ్యాయి.
Mahesh Babu Swimming Pool Pic Goes Viral
- Advertisement -