Monday, December 23, 2024

ఫోన్ పే స్పీకర్లలో మహేష్ బాబు వాయిస్.. (వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

ఇకపై ఫోన్ పే స్పీకర్లలో మహేష్ బాబు వాయిస్ వినబడనుంది. ఫోన్ పే స్మార్ట్ స్పీకర్‌లు దేశం అంతటా కస్టమర్ చెల్లింపులను ధృవీకరించడానికి చెల్లించిన మొత్తాన్ని ప్రకటించే వాయిస్ ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. గత సంవత్సరం, వారు బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్‌తో కలిసి పని చేయడం ద్వారా సెలబ్రిటీ టచ్‌తో దాన్ని మెరుగుపరిచారు. ప్రత్యేకమైన సెలబ్రిటీ వాయిస్ ఫీచర్ అమితాబ్ బచ్చన్ వాయిస్‌లో కస్టమర్ చెల్లింపుని ధృవీకరిస్తుంది.

తెలుగులో అదే ఫీచర్ ఇప్పుడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ తో లాంచ్ అవుతోంది. మహేష్ బాబు ఈ ప్రత్యేకమైన వాయిస్ ఫీచర్ ద్వారా ఫోన్ పేని ఎండార్స్ చేస్తున్నారు. ఇక నుండి, ఫోన్ పే స్మార్ట్‌స్పీకర్లు కస్టమర్‌లు చెల్లించినప్పుడు, చెల్లించిన మొత్తాన్ని ప్రకటించిన తర్వాత వారికి ‘ధన్యవాదాలు బాస్’ అని చెబుతారు.

దీనికి సంబంధించిన ప్రకటన చిత్రీకరించబడింది. అది ఆన్‌లైన్‌లో లీక్ చేయబడింది. సందేశం కోసం కంపెనీ మహేష్ బాబు వాయిస్ నమూనాలను తీసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నంబర్లు రూపొందించబడతాయి. ఫోన్ పే కొత్త వాయిస్ ఫీచర్‌తో మహేష్ బాబు వాయిస్ ప్రతిచోటా ఎక్కువగా వినిపిస్తున్నట్లు కనిపిస్తోంది. ఫోన్ పే మలయాళం కోసం మమ్ముట్టితో, కన్నడ భాషా స్వరాల కోసం సుదీప్‌తో కలిసి పనిచేస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News