Thursday, January 23, 2025

‘ఆచార్య’కు సూపర్‌స్టార్ వాయిస్ ఓవర్

- Advertisement -
- Advertisement -

Mahesh babu voice over for Acharya

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కీలక పాత్రలో నటించిన భారీ సినిమా ‘ఆచార్య’. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా ఈనెల 29న విడుదల కానుంది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను శనివారం హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో భారీ స్థాయిలో నిర్వహించనున్నారు. ఇదిలాఉండగా సూపర్ స్టార్ మహేష్ బాబు ‘ఆచార్య’ సినిమాకు వాయిస్ ఓవర్‌ని అందిస్తున్నట్టుగా తెలిసింది. మహేష్ వాయిస్ ఓవర్ ఈ సినిమాకు ప్లస్ కానుంది. ఇక ఈ సినిమాలో కాజల్, పూజా హెగ్డేలు హీరోయిన్లుగా నటించగా మణిశర్మ సంగీతం అందించారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News