Wednesday, January 22, 2025

‘రైటర్ పద్మభూషణ్‌’కు ఫిదా అయిన సూపర్ స్టార్..

- Advertisement -
- Advertisement -

‘కలర్ ఫోటో’ ఫేం సుహాస్‌ నటించిన ‘రైటర్ పద్మభూషణ్‌’కు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫిదా అయ్యాడు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ మూవీని చిత్రయూనిట్ తో కలిసి వీక్షించిన మహేష్ బాబు ప్రశంసలు కురిపించారు.

“రైటర్ పద్మభూషణ్ చూసి చాలా ఎంజాయ్ చేశాను. హార్ట్ వార్మింగ్ ఫిల్మ్. ముఖ్యంగా క్లైమాక్స్ అదిరింది.  ఫ్యామిలీస్ తప్పనిసరిగా చూడవలసిన సినిమా ఇది. సినిమాలో సుహాస్ నటన నచ్చింది. ఘనవిజయం సాధించిన శరత్, అనురాగ్ రెడ్డి, షణ్ముఖ ప్రశాంత్‌ అండ్ టీమ్ అందరికీ అభినందనలు’’ అంటూ చిత్రబృందంతో దిగిన ఫోటోను మహేష్ బాబు సోషల్ మీడియాలో షేర్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News