Wednesday, January 22, 2025

మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి కన్నుమూత..

- Advertisement -
- Advertisement -

Mahesh babu's Mother Indira devi passed away

హైదరాబాద్: సూపర్ స్టార్ కృష్ణ భార్య, మహేష్ బాబు తల్లి ఘట్టమనేని ఇందిరాదేవి కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం తెల్లవారుజుమున 4 గంటలకు మరణించారు. కృష్ణ-ఇందిరాదేవిలకు కుమారులు హీరో మహేష్ బాబు, రమేష్ బాబుతోపాటు కుమార్తెలు పద్మావతి, మంజుల, ప్రియదర్శినితో ఐదుగురు సంతానం. అయితే, ఇటీవల రమేష్ బాబు కూడా అనారోగ్యంతో చనిపోయిన విషయం తెలిసింది. ఇప్పుడు తల్లి ఇందిరాదేవి కూడా మరణించడంతో మహేష్ బాబు కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కాగా, ఈ రోజు ఉదయం 9 గంటలకు అభిమానులు సందర్శన కోసం ఆమె పార్ధివదేహాన్ని పద్మాలయ స్టూడియోలో ఉంచి అనంతరం మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరపనున్నట్లు తెలుస్తోంది.

Mahesh babu’s Mother Indira devi passed away

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News