Thursday, January 23, 2025

మహేష్‌బాబుకు మాతృ వియోగం

- Advertisement -
- Advertisement -

సూపర్ స్టార్ కృష్ణ సినిమాలకి రాక ముందే ఇందిరాదేవిని వివాహం చే సుకున్నారు. కృష్ణ, ఇందిరాదేవిల వి వాహం 1961లో జరిగింది. వివా హం అయినా తరువాత కృష్ణ సినిమా లు చేయడానికి చెన్నై రావటం… అక్కడ తన ప్రయత్నాలు చెయ్యటం మొదలు పెట్టారు. ఆలా చేస్తున్న సమయంలోనే దర్శకుడు ఆదుర్తి సు బ్బారావు తన సినిమా ‘తేనె మనసులు’ కొత్తవాళ్లతో తీయాలన్న ఉద్దేశంతో పే పర్‌లో ప్రకటన ఇవ్వటం, ఆ సినిమాకి కృష్ణ ఒక లీడ్ యాక్టర్‌గా ఎంపిక కావడం జరిగింది. అప్పటికే రమేష్ బాబు జన్మించటం, కృష్ణ, ఇందిరా దేవిలు చెన్నైలోనే కాపురం పెట్టడం జరిగింది. ఆమె ఎక్కువ కాలం చెన్నైలోనే గడిపారు.

సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి, సూపర్‌స్టార్ మహేష్ బాబు తల్లి అయిన ఘట్టమనేని ఇందిరా దేవి బుధవారం తెల్లవారు జామున కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె నివాసంలోనే తుది శ్వాస విడిచారు. ఇక కృష్ణ, – ఇందిరా దేవిలకు మొత్తం ఐదుగురు సంతానం. రమేష్ బాబు, మహేష్ బాబుతో పాటుగా, పద్మావతి, మంజుల, ప్రియదర్శినిలు వారి సంతానం. కాగా ఇటీవల కాలంలోనే కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబుతో పాటు విజయ నిర్మల మృతి చెందిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇందిరా దేవి మరణంతో కృష్ణ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇక ఇందిరా దేవి అంత్యక్రియలను బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని మహా ప్రస్థానంలో నిర్వహించారు. ఈ అంత్యక్రియల్లో ఘట్టమనేని కృష్ణ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అంతకుముందు ప్రముఖులు, సన్నిహితులు, అభిమానుల సందర్శనార్థం ఇందిరా దేవి పార్థివదేహాన్ని పద్మాలయ స్టూడియోలో ఉంచారు. ఆమెకు తుది నివాళుల ర్పించేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు.

రాష్ట్ర మంత్రి కేటీఆర్ వెళ్లి ఇందిరాదేవి భౌతికకాయనికి నివాళులర్పించారు. కృష్ణ, మహేష్ బాబుని ఓదార్చి, వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఇందిరా దేవి మృతి పట్ల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. సినీ ప్రముఖులు వెంకటేష్, రానా, జీవితా రాజశేఖర్, కొరటాల శివ, అశ్వనీదత్, త్రివిక్రమ్, మురళీ మోహన్, మోహన్‌బాబు, బి.గోపాల్, బండ్ల గణేష్, రామకృష్ణ, తమన్ తదితరులు ఇందిరా దేవికి తుది నివాళి అర్పించారు. ఇక నాన్నమ్మ భౌతిక కాయాన్ని చూసి మహేష్ కుమార్తె సితార కన్నీటి పర్యంతమైంది.

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ “ శ్రీమతి ఇందిరాదేవి స్వర్గస్తులయ్యారు అనే వార్త ఎంతో కలచివేసింది. ఆ మాతృ దేవత ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ.. సూపర్ స్టార్ కృష్ణకి, సోదరుడు మహేష్ బాబుకి, ఆయన కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను”-అని అన్నారు. “ఘట్టమనేని కృష్ణ సతీమణి, ఘట్టమనేని మహేశ్ బాబు మాతృమూర్తి ఇందిరాదేవి మరణం బాధాకరం. ఇందిరాదేవి లేకపోవడం కృష్ణ కుటుంబానికి తీరని లోటు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను”-అని నందమూరి బాలకృష్ణ అన్నారు. “ప్రముఖ నటులు కృష్ణ సతీమణి, శ్రీ మహేష్ బాబు మాతృమూర్తి శ్రీమతి ఇందిరాదేవి తుది శ్వాస విడిచారనే విషయం విచారం కలిగించింది. ఈ బాధ నుంచి కృష్ణ, మహేష్ బాబుత్వరగా కోలుకొనే మనో ధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిసున్నాను”-అని పవన్ కల్యాణ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News