Sunday, September 8, 2024

ఎంఎల్ సి కవితకు శుభాకాంక్షలు తెలిపిన ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల

- Advertisement -
- Advertisement -

Mahesh Bigala, NRI Coordinator, congratulated MLC Kavita

 

మనతెలంగాణ/హైదరాబాద్ : ఉమ్మడి నిజామాబాద్ స్థానిక సంస్థల ఎంఎల్ సిగా టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఏకగ్రీవంగా ఎన్నికకావడంపై టిఆర్‌ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహేష్ బిగాల మాట్లాడుతూ ఒక గొప్ప వక్త, అన్ని రంగాల్లో మంచి విషయ పరిజ్ఞానం, ప్రజా సమస్యలపై ఎనలేని పోరాట స్వభావం ఉన్న నాయకురాలు కవిత మరోసారి ఎంఎల్ సిగా ఎన్నికకావడం అందరికీ సంతోషకరమన్నారు. ముఖ్యంగా జిల్లా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. స్థానిక సంస్థల నుంచి ఎంఎల్ సిగా కవిత ఎన్నిక కావడంతో జడ్పీటిసిలు, ఎంపిటిసిలకు భరోసా వచ్చినట్లయిందన్నారు. అలాగే నిజామాబాద్ జిల్లాలో మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News