Monday, December 23, 2024

ఆనాటి జలదృశ్యం నుంచి ఈనాటి సుజల దృశ్యం వరకు…

- Advertisement -
- Advertisement -

21 సంవత్సరాల పార్టీ ప్రస్థానంగా అద్భుతం
టిఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐల కో ఆర్డినేటర్ మహేష్ బిగాల

Mahesh bigala with KTR in TRS Plenary

మనతెలంగాణ/హైదరాబాద్:  టిఆర్‌ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్లీనరీలో టిఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐల కో ఆర్డినేటర్ మహేష్ బిగాలతో పాటు వివిధ దేశాల ఎన్నారై ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ బిగాల మాట్లాడుతూ ఆనాటి జలదృశ్యం నుంచి ఈనాటి సుజల దృశ్యం వరకు 21 సంవత్సరాల పార్టీ ప్రస్థానంగా అద్భుతంగా ఉందన్నారు. ప్రత్యేక రాష్ట్రం కొరకు ఆవిర్భవించిన పార్టీ టిఆర్‌ఎస్ అని, దశాబ్ధాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన పార్టీ టిఆర్‌ఎస్ అని ఆయన పేర్కొన్నారు. సాధించుకున్న రాష్ట్రాన్ని, అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న సిఎం కెసిఆర్ నాయ కత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యూకె, యూఎస్‌ఏ, ఆస్ట్రేలియా, బహ్రెయిన్, మలేషియా, దక్షిణాఫ్రికా, టాంజానియా, మారిషస్, జాంబియా, నార్వే, ఖతార్, ఫిలిప్పీన్స్, చైనా, జర్మనీ, ఒమన్ తదితర దేశాల ప్రతినిదులు పాల్లొన్నారు.

ఆస్ట్రేలియా నుంచి ప్లీనరీకి….

టిఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హైదరాబాద్‌లోని హెచ్‌ఐఐసీలో బుధవారం ఘనంగా జరిగాయి. టిఆర్‌ఎస్ ఆస్ట్రేలియా ప్రతినిధులు తమ బృందంతో ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా నుంచి కాసర్ల నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ సిఎం కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రం అద్భుతంగా పురోగమిస్తుందన్నారు. ఆస్ట్రేలియా నుంచి ప్రత్యేకంగా ప్లీనరీకి వచ్చిన వినయ్ సన్నీ, కార్తిక్, లక్ష్మణ్ చారీ, భరత్ సింహ రెడ్డిలను నాగేందర్ రెడ్డి అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News