మన తెలంగాణ/హైదరాబాద్: సిబిఐ, ఈ డీలను కేంద్ర ప్రభుత్వం తమ జేబు సంస్థ ల్లా వాడుకుంటోందని, కేవలం ప్రతిపక్షాల పై అక్రమ కేసులు పెట్టేందుకే ఈడీని బిజెపి ఉపయోగించుకుంటుందని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసిసి నేతలు రా హుల్ గాంధీ, సోనియా గాంధీ పేర్లను ఈ డీ చార్జీషీట్ లో చేర్చింది. దీనిపై కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చే స్తున్నారు. ఏఐసిసి పిలుపు మేరకు టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా చేపట్టిన ర్యాలీ లో కాంగ్రెస్ నేతలు పెద్దఎత్తున పాల్గొన్నా రు. ఈ ర్యాలీలో పార్టీ నేతలకు మద్దతుగా, బిజెపి నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈసందర్భంగా హైదరాబాద్‌లో మహేష్‌గౌడ్ మీడియాతో మాట్లాడు తూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై ఆగ్ర హం వ్యక్తం చేశారు. కేంద్రంలో బిజెపి ప్ర భు త్వం ఏర్పడి పదేళ్లు అవుతుందని, అప్పటి నుంచి దాదాపు 95 శాతం ఈడీ కేసులన్నీ ప్రతిపక్షాలపైనే పెడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. 2014 నుంచి నమోదైన ప్రతి 100 కేసుల్లో 95 కేసులు ప్రతిపక్షాలపైనే ఉంటున్నాయని,ప్రతిపక్షాల పేర్లు లేకుండా ఈడీ చార్జీ షీట్లు దాఖలు చేయడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.హుస్నాబాద్ నియోజకవర్గంలో బిసి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో వేలాదిమంది కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సోనియా, రాహుల్‌గాంధీలపై ఈడీ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలతో పాటు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
దేశవ్యాప్తంగా నిరసనలు
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) చార్జిషీట్ దాఖలు చేయడం పట్ల నిరసన సూచకంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బుధవారం దేశవ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కేసుకు ‘బోగస్ కథనం’ ఆధారమని కాంగ్రెస్ ఆరోపించింది. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఎజెఎల్) డబ్బు గాని, ఆస్తి గాని గాంధీల నియంత్రణలోని యంగ్ ఇండియన్‌కు బదలీ కాలేదని పార్టీ స్పష్టం చేసింది. ‘ప్రభుత్వ ప్రాయోజిత నేరానికి’ వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రాష్ట్ర రాజధానులు, జిల్లా కేంద్రాల్లో ఇడి కార్యాలయాలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముందు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించారు.
వారిలో అనేక మందిని పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. సచిన్ పైలట్, ఇమ్రాన్ ప్రతాప్‌గఢి, గుర్దీప్ సప్పల్ వంటి సీనియర్ నేతలు ఢిల్లీలో ఎఐసిసి కార్యాలయంలో నిరసనలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (సంస్థ) కెసి వేణుగోపాల్ ‘ఎక్స్’లో నిరసనల చిత్రాలను పంచుకుంటూ, ‘మోడీ భయపడినప్పుడు ఆయన ఇడిని ముందుకు తెస్తారు& ఖర్గేజీ, రాహుల్‌జీ నాయకత్వంలో వృద్ధి చెందుతున్న, పునరుజ్జీవం పొందిన కాంగ్రెస్ పట్ల బిజెపి భయమే ఇటువంటి చర్యలకు పురికొల్పుతున్నది తప్ప వేరేమీ కాదు. మా నేతలకు దన్నుగా ఉంటాం. మున్ముందు రెట్టించిన ఉత్సాహంతో అన్ని బెదరింపు యత్నాలను అడ్డుకుంటాం’ అని పేర్కొన్నారు.