Friday, November 15, 2024

మహేష్‌లో అద్భుతమైన రిధమ్ ఉంది

- Advertisement -
- Advertisement -

Mahesh has an amazing rhythm

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట’ కోసం ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా అంచనాలని మరో స్థాయికి తీసుకెళ్లింది థియేట్రికల్ ట్రైలర్. ఈ ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని ఆల్ టైం రికార్డ్‌ని సృష్టించింది. ఇక మ్యూజికల్ సెన్సేషన్ తమన్ సంగీతంలో ‘సర్కారు వారి పాట’ ఆడియో ఇప్పటికే చార్ట్ బస్టర్‌గా నిలిచింది. కళావతి, పెన్నీ, టైటిల్ సాంగ్.. ప్రేక్షకులని అమితంగా అలరించాయి. ముఖ్యంగా కళావతి పాట 150 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసి సరికొత్త రికార్డ్‌ని సృష్టించింది. ఈ పాటలో మహేష్ బాబు వేసిన సిగ్నేచర్ స్టెప్స్‌కు సోషల్ మీడియాలో అద్భుతమైన స్పందన వస్తోంది.

ఈనెల 12న ప్రపంచవ్యాప్తంగా ‘సర్కారు వారి పాట’ గ్రాండ్‌గా విడుదల కాబోతున్న నేపధ్యంలో సినిమా కోసం గ్రేట్ సిగ్నేచర్ మూమెంట్స్‌ని కంపోజ్ చేసిన స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ మీడియాతో ముచ్చటించారు. ఆయన మాట్లాడుతూ “ఈ సినిమాలో మూడు పాటలకు డ్యాన్స్ కంపోజ్ చేశాను. కళావతి, పెన్నీతో పాటు ఓ మాస్ సాంగ్ చేశా. కళావతి, పెన్నీ ఇప్పటికే విజయాలు సాధించాయి. రాబోతున్న పాట కూడా ఫ్యాన్స్‌కు గొప్ప ట్రీట్. ఇందులో మహేష్ బాబు స్వాగ్ అండ్ మాస్ రెండూ చూస్తారు. ఆయన సిగ్నేచర్ మూమెంట్స్ నెక్స్ లెవెల్‌లో ఉంటాయి. మహేష్ డ్యాన్స్ చాలా త్వరగా నేర్చుకుంటారు. ఆయనలో అద్భుతమైన రిధమ్ వుంది. ఆయన బాడీ లాంగ్వేజ్ అర్ధం చేసుకుంటే చాలు. కొరియోగ్రాఫర్‌గా చిరంజీవికి, ప్రభు మాస్టర్‌కి చేయాలని అనుకున్నాను. ఆ టార్గెట్ రీచ్ అయ్యింది. రాజమౌళి, పవన్ కళ్యాణ్ సినిమాలకి చేయాలని ఉంది. ఇక ప్రస్తుతం శింబు, శివకార్తికేయన్ సినిమాలు చేస్తున్నా. చిరంజీవి, మైత్రీ మూవీ మేకర్స్ సినిమా, రవితేజ ‘ధమాక’ సినిమాలకి చేస్తున్నా”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News