Sunday, December 22, 2024

ఈ దేశానికి భవిష్యత్‌.. రాహుల్‌ గాంధీ: మహేశ్‌ కుమార్‌ గౌడ్‌

- Advertisement -
- Advertisement -

ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలో కుల గణన చేపట్టే అంశంపై గాంధీ భవన్ లో సీఎం రేవంత్ రెడ్డితోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు సమావేశమై చర్చించారు. అనంతరం సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ మీడియాతో మాట్లాడుతూ.. కులగణను కాంగ్రెస్‌ పార్టీ చాలా ప్రాధాన్య అంశంగా తీసుకుందని చెప్పారు. రాహుల్‌ గాంధీ ఈ దేశానికి భవిష్యత్‌ అని అన్నారు. దేశంలో కులగణన జరగాల్సిన అవసరం ఉందని రాహుల్‌ గాంధీ చెప్పారని.. జనాభా దామాషా మేరకు రిజర్వేషన్లు కల్పించాలని ఆయన పోరాడుతున్నారని తెలిపారు.

రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి కూడా ధైర్యవంతమైన నిర్ణయం తీసుకున్నారన్నారు. కులగణనపై నవంబర్‌ 2న జిల్లాల్లో డీసీసీ అధ్యక్షుల ఆధ్వర్యంలో సమావేశం జరుగుతుందని చెప్పారు.తర్వాత నవంబర్ 5 లేదా 6వ తేదీన కులగణనపై రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహిస్తామని, కేంద్రం.. జన గణనలో ఓబీసీ కులగణన చేపట్టాలని తీర్మానం చేస్తామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News