Saturday, April 19, 2025

రాహుల్ సంకల్పం ముందు మోడీ కుట్రలు పనికిరావు : మహేష్ కుమార్ గౌడ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కక్షసాధింపులో భాగంగానే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై కేసులు పెడుతున్నారని టిపిసిసి ఛీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు చేశారు. మోదీ ప్రభుత్వం అక్రమ కేసుల కుట్రలకు తెరలేపిందని అన్నారు. టిపిసిసి ఆద్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఈడి కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ ధర్నాలో టిపిసిసి ఛీప్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపిలు, పార్టీ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. రాహుల్ ఇమేజ్ ను డ్యామేజ్ చేయడానికే అక్రమ కేసులు పెడుతున్నారని మహేష్ గౌడ్ అన్నారు. కులగణనతో మోదీకి రాహుల్ రాజకీయ మరణశాసనం రాశారని చెప్పారు. రాహుల్ సంకల్పం ముందు మోడీ కుట్రలు పనికిరావని మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News