Friday, January 31, 2025

రిజర్వేషన్ల పెంపు తరువాతే స్థానిక ఎన్నికలు

- Advertisement -
- Advertisement -

 ఎఐసిసికి ఎంఎల్‌సి అభ్యర్థుల
జాబితా అధిష్ఠానానిదే తుది
నిర్ణయం హామీల అమలుపై
ప్రజలను మోసం చేయం మీడియాతో
చిట్‌చాట్‌లో పిసిసి చీఫ్ మహేశ్
మనతెలంగాణ/హైదరాబాద్: రిజర్వేషన్ల పెంపు తర్వాత స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తామని టిపిసిసి చీఫ్ మహేశ్ కుమార్‌గౌడ్ అన్నారు. అధికార యం త్రాంగం వల్ల పథకాలు కొంత క్షేత్రస్థాయిలోకి వెళ్లడం లేదని ఆయన తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హా మీల అమలుకు కొంత ఆలస్యం కావచ్చు కానీ, ప్రజల్ని మాత్రం మోసం చేయమని, బిఆర్‌ఎస్ మాదిరిగా అబద్దాలు చెప్పి చేతులు ఎత్తేయడం లేదని ఆయన అన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని పథకాల అమలు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. గురువారం గాంధీభవన్‌లో మీడియాతో ఆయన చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ గ్రాడ్యుయేట్,

టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ఎమ్మెల్యేల అభిప్రాయ ప్రకారం ఉంటుందన్నారు. అభ్యర్థుల జాబితా ఇప్పటికే ఏఐసిసికి పంపించామని అధిష్టానానిదే తుది నిర్ణయమని ఆయన అన్నారు. అభ్యర్థుల ఎంపికపై వచ్చే నెల 3వ తేదీన సమావేశం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. కుల సర్వే జరిగితే తమకు నష్టం జరుగుతుందని బిఆర్‌ఎస్, బిజెపిలు కుట్రలు చేశాయని, కానీ, కులగణన సంపూర్ణంగా పూర్తయిందని ఆయన పేర్కొన్నారు. కులగణన రిపోర్టుపై ఫిబ్రవరి 5వ తేదీన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ఉంటుందని ఆయన చెప్పారు.

మా సోషల్ మీడియా టీమ్ కొంత వీక్ ఉంది
సిఎం రేవంత్ రెడ్డి తన నివాసం లేదా కమాండ్ కంట్రోల్ రూం నుంచే సమీక్షలు నిర్వహిస్తున్నారన్న బిఆర్‌ఎస్ విమర్శలను మహేశ్ కుమార్ గౌడ్ ఖండించారు. సమయాన్ని బట్టి సిఎం ఇంటి దగ్గర సమీక్ష చేస్తారని, అం దులో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. సచివాల యం కూల్చి మళ్లీ కట్టాల్సిన అవసరం ఏమొచ్చిందో బిఆర్‌ఎస్ సమాధానం చెప్పాలన్నారు. తమ సోషల్ మీడి యా టీమ్ కొంత వీక్ ఉందని, దానిని పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ప్రజలు ఎవ రూ ఫాంహౌజ్ పాలన కోరుకోరని, మానుప్యూలెట్ సర్వే లు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

వచ్చే నెలలో రాష్ట్రానికి రాహుల్ గాంధీ
ఫిబ్రవరి రెండో వారంలో సూర్యాపేట జిల్లాలో రాహుల్ గాంధీ సభ నిర్వహించబోతున్నామని మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. పటాన్‌చెరు కాంగ్రెస్ వివాదంపై కమిటీ నివేదిక ఇంకా రాలేదన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ జాతీయ నాయకులు సోనియా గాంధీ, ఖర్గే, రాహుల్ గాంధీ, సిఎం రేవంత్ రెడ్డి ఫొటోలు పెట్టుకుంటే బాగుటుందన్నారు. త్వరలో జరగబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండాను ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీపై ఫోకస్ చేస్తున్నామని, మేయర్ పీఠం గెలుచుకుంటామ న్నారు. గురువారం జరిగిన జీహెచ్‌ఎంసీ మీటింగ్‌కు బిజెపి సభ్యులు బిక్షాటన చేస్తూ వచ్చారని ఆయన అన్నారు. కానీ, కేంద్రం నుంచి హైదరాబాద్‌కు నయా పైసా తీసుకురాని ఇద్దరు కేంద్ర మంత్రులు మన రాష్ట్రం లో ఉన్నారని ఆయన విమర్శించారు. కేంద్రం రాష్ట్రానికి నిధులు ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. సంవత్సర కాలంగా ప్రభుత్వ ఫలాలు అందరికీ అందుతున్నాయన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News