Sunday, January 19, 2025

బిజెపి, బిఆర్‌ఎస్‌లు కుమ్మక్కు.. అందుకే కవితకు బెయిల్: మహేశ్ కుమార్ గౌడ్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: కవితకు బెయిల్ వస్తుందని తాము ముందే ఊహించామని ఎమ్మెల్సీ, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. బిజెపి, బిఆర్‌ఎస్‌లు కుమ్మక్కు కావడంతోనే బెయిల్ వచ్చిందని ఆయన ఆరోపించారు. మొన్నటి వరకు చీకటి ఒప్పందాలతో కాంగ్రెస్‌ను దెబ్బతీయాలని చూశారన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ హరీష్‌రావు, కెటిఆర్‌లు ఢిల్లీలో బిజెపి నేతల చుట్టూ ఆపద మొక్కులు మొక్కారని ఆయన అన్నారు. బిజెపి నేతల ఇళ్ల చుట్టూ తిరిగి కాళ్ల మీద పడి కవితకు బెయిల్ తెచ్చుకున్నారన్నారు. దీనిని తెలంగాణ ప్రజలందరూ అర్థం చేసుకోవాలన్నారు. బిజెపి, బిఆర్‌ఎస్‌ల కుమ్మక్కు రాజకీయాలు బయటపడ్డాయన్నారు. బిజెపిలో బిఆర్‌ఎస్ విలీన ప్రక్రియ మొదలవుతుందన్నారు.

కెసిఆర్, కెటిఆర్‌ల కోసం కవిత బలిపశువు: అద్దంకి దయాకర్
కెసిఆర్, కెటిఆర్‌ల కోసం కవిత బలిపశువు అయ్యారని, కవితను ఎరగా వేసి బిఆర్‌ఎస్‌ను లొంగదీసుకోవడంలో బిజెపి విజయవంతం అయ్యిందని టి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు. సుప్రీంకోర్టులో కవితకు బెయిల్ మంజూరైన నేపథ్యంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు ఎపిసోడ్ ఎపి, తెలంగాణలో పెద్ద ఎత్తున జరుగుతోందన్నారు. ఈ కేసును తమకు రాజకీయ లబ్ధిగా మలుచుకునేందుకు బిఆర్‌ఎస్ కవితను ముద్దాయిగా చేశారని అయితే కవిత అరెస్ట్ కాకపోవడంతో రాజకీయంగా బిఆర్‌ఎస్‌కు నష్టం వచ్చిందన్నారు. ఎంపి ఎన్నికల సమయానికి అరెస్ట్ చేసినా ఆ ప్రయోజనం బిజెపికి దక్కిందన్నారు. బిజెపి ప్లాన్ ప్రకారం రాజకీయంగా బలపడుతూ బిఆర్‌ఎస్‌ను అణగదొక్కుతూ వెళ్లిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News