Saturday, May 3, 2025

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహరం.. ప్రధాని కూడా పొరపాటు పడ్డారు: మహేష్ కుమార్ గౌడ్

- Advertisement -
- Advertisement -

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఏఐ ఫేక్ వీడియోలు చూసి ప్రధాని మోదీ కూడా పొరపాటు పడ్డారని టీపిసిసి చీఫ్ మహేశ్‌ కుమార్‌గౌడ్‌ అన్నారు. అవి ఫేక్ వీడియోలు అని తెలిశాక కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఎక్స్‌లో పెట్టిన వీడియోలు తొలగించారని చెప్పారు.దీనిపై బిఆర్ఎస్ నాయకులు అందరనీ తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చాక కూడా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ 400 ఎకరాల భూములను ప్రైవేటుపరం చేసే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్‌ చుట్టూ వేల ఎకరాల భూములను విక్రయించిందని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు.

కాగా, ఇటీవల ఓ పబ్లిక్ మీటింగ్ లో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ప్రకృతిని ధ్వంసం చేసి వన్యప్రాణులను చంపుతుందని ధ్వజమెత్తారు. అడవులపై బుల్డోజర్లు నడపడంలో తెలంగాణ సర్కారు బిజీగా ఉందని ఆయన విమర్శించారు. తమ ప్రభుత్వం అడవులను కాపాడుతుంటే.. కాంగ్రెస్ సర్కారు అడవులను నాశనం చేస్తోందని మండిపడ్డారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలో కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూముల గురించి గత కొన్ని రోజులుగా వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News