Sunday, January 19, 2025

ఈ వివాదాన్ని ఇంతటితో ముగించండి: సినీ ప్రముఖులకు పీసీసీ చీఫ్‌ విజ్ఞప్తి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అక్కినేని నాగార్జున కుటుంబంపై మంత్రి కొండ సురేఖ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. మంత్రి వ్యాఖ్యలపై సినీ ప్రముఖులు తీవ్రంగా స్పందించారు. సోసల్ మీడియాలో మంత్రి వ్యాఖ్యలు ఖండిస్తూ పోస్టులు పెడుతున్నారు. దీంతో కాంగ్రెస్ టీపీసీసీ చీఫ్ వెంటనే రంగంలో దిగి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియోను షేర్ చేశారు.

“సినీ ప్రముఖులకు పీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ విజ్ఞప్తి.. ఈ ఎపిసోడ్‌ని ఇంతటితో ముగించండి. మంత్రి కొండా సురేఖ భేషరతుగా వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నారు. ఇరువైపులా మహిళలే ఉన్నారు. ఈ విషయాన్ని ఇక్కడికే ముగిస్తే సమంజసంగా ఉంటుంది. కేటీఆర్ సోషల్ మీడియాలో మంత్రి మీద చేసిన ట్రోల్స్‌ కూడా సినిమా పెద్దలు గమనించాలి” మహేష్‌ కుమార్‌ గౌడ్‌ కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News