- Advertisement -
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అన్యాయం చేస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంపై ఫైరయ్యారు. గత పదకొండేళ్లలో మోదీ సర్కారు తెలంగాణకు ఇచ్చింది సున్న అంటూ మండిపడ్డారు. ఇటీవల కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. మోదీ ప్రభుత్వం ఫెడరల్, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. డీలిమిటేషన్ జరిగితే దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగుతుందని.. డీలిమిటేషన్ జరగకుండా ఉండేందుకు కోదండరాంతో కలసి నడుస్తామని ఆయన అన్నారు.
- Advertisement -