Sunday, January 19, 2025

కెసిఆర్ ఫాంహౌస్‌కే పరిమితం కావడం దారుణం: మహేశ్ కుమార్ గౌడ్

- Advertisement -
- Advertisement -

రాజకీయాలను పక్కన పెట్టి సాయం చేయాల్సిన సోయి కెసిఆర్‌కు లేదా?
ప్రజలను పట్టించుకోకుండా కెటిఆర్ ఇంగ్లాండ్‌లో రిలాక్స్ అవుతున్నారు
కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్
మనతెలంగాణ/హైదరాబాద్: భారీ వర్షాలతో తెలంగాణ అతలాకుతలం అవుతోందని ఇలాంటి కష్ట కాలంలో బాధ్యతగా ఉండాల్సిన ప్రతిపక్ష నాయకుడు కెసిఆర్ ఎక్కడ ఉన్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. మంగళవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు భరోసా ఇస్తూ ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని కెసిఆర్‌కు ఆయన సూచించారు. గాంధీభవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కెసిఆర్ ఫాంహౌస్‌కే పరిమితం కావడం దారుణమన్నారు.

రాజకీయాలను పక్కన పెట్టి సాయం చేయాల్సిన సోయి లేదా? కెసిఆర్‌కు లేదా అని ఆయన ప్రశ్నించారు. మొన్నటి వరకు కవిత బెయిల్ కోసం పనిచేసిన కెటిఆర్ ఇప్పుడు హాయిగా ఇంగ్లాండ్‌లో రిలాక్స్ అవుతున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంటే ఇంగ్లాండ్‌లో విహార యాత్రలు ఎంజాయ్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బాధ్యత మరిచి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఆయన అన్నారు.

కెటిఆర్‌కు హెలికాప్టర్ల సోకులు తప్పా మరేం లేదు
సిఎం రేవంత్ రెడ్డి వరద బాధితులను ఆదుకోడానికి రోడ్డు మార్గంలో వెళ్లి పర్యటిస్తున్నారని, నాలుగైదు రోజులుగా మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా ప్రజల్లోనే ఉన్నారని ఆయన చెప్పారు. కెటిఆర్‌కు హెలికాప్టర్ల సోకులు తప్పా మరేం లేదన్నారు. ‘పసలేని ట్వీట్లు పెడుతూ కెటిఆర్ విమర్శలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎన్నికల ముందు వరద సాయం చేస్తానని చెప్పి అన్ని ఎగొట్టారని ఆయన ఆరోపించారు. ప్రధాన మంత్రి ఫసల్ భీమా కట్టకుండా రైతులను మోసం చేసిన మొనగాడు కెసిఆర్ అని బిఆర్‌ఎస్ హయాంలో రాజ్ భవన్ ముందున్న ఎంఎస్ ముక్తా నీటమునిగినా కెసిఆర్ గడపదాటి బయటికి రాలేదన్నారు. కేంద్రంతో కూడా సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడి ఆర్థికసాయం కోరారని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News