Saturday, December 21, 2024

సిఎం రేవంత్ తో మహేష్ కుమార్ భేటీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టిపిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ లోని రేవంత్ ఇంట్లో తన కుటుంబ సభ్యులతో మహేష్ కలిశారు. మహేష్ కు పిసిసి పదవి వరించినందుకు ఆయనను రేవంత్ అభినందించారు. రేవంత్ రెడ్డికి మహేష్ కుమార్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు. పిసిపి ఛీఫ్ నియామకం అయిన తరువాత ఫస్ట్ సారి సిఎంను ఆయన కలిశారు.

ఈ సందర్భంగా మహేష్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకొని ముందుకు వెళ్తానని, ఇది తన ముందున్న అతి పెద్ద టాస్క్ అని తెలిపారు. రెండు మూడు రోజుల్లో పిసిసి బాధ్యతలు తీసుకుంటానని మహేష్ వివరణ ఇచ్చారు. త్వరలోనే పార్టీ పదువుల భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు క్యాడర్ సిద్ధం చేస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News